బెంగళూర్ : ఐటీ సిటీ బెంగళూర్‌లో టెకీలే కాదు ఏ మూల చూసినా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకూ కొదవుండదు. అయితే వీరంతా ఎత్తైన బిల్డింగుల్లోనో లగ్జరీ క్యాబిన్లలోనో కనిపించరు. కంటినిండా కలలు నింపుకున్న ఓ చాయ్‌వాలా, ఓ ఆటోవాలాలోనూ ఎంట్రప్రెన్యూర్ కనిపించవచ్చు. బెంగళూర్‌లో జనార్ధన్ అనే ఆటోడ్రైవర్ (Viral Post) ఈ కోవలోకే వస్తాడు.
ఈ ఆటోడ్రైవర్ స్టోరీని సుశాంత్ కోషీ ట్విట్టర్లో షేర్ చేశారు. సుశాంత్ పోస్ట్‌లో జనార్ధన్ ఆటో ఫొటో కనిపిస్తుంది. ఆటోలోపల నా యూట్యూబ్ చానల్ గోల్డ్ జనార్ధన్ ఇన్వెస్టర్‌ను సబ్‌స్క్రైబ్ చేయండి అని ప్లకార్డు కనిపిస్తుంది. ఈరోజు నా ఉబర్ ఆటో డ్రైవర్ పర్సనల్ ఫైనాన్స్‌లో నిపుణుడైన యూట్యూబ్ ఇన్ఫ్లుయన్సర్ అని పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చారు. జనార్ధన్ యూట్యూబ్ చానెల్ చూస్తే ఆశ్చర్యానికి లోనయ్యానని కోషీ రాసుకొచ్చారు.
My Uber auto driver today is a YouTube influencer, specialising in personal finance. @peakbengaluru https://t.co/FZJWWzMFhB pic.twitter.com/crM8Im9JOK
— Sushant Koshy (@sushantkoshy) March 3, 2023
కేంద్ర బ్యాంకులు కేవలం డబ్బును ముద్రించడానికే కాదని అవెన్నో కీలక విధులను నిర్వర్తిస్తాయని అతడు వివరించిన తీరు అద్భుతమని కొనియాడారు. సంక్లిష్టమైన ఆర్ధిక అంశాలను అవగాహన చేసుకునేందుకు, ఆటో నడుపుతూనే గ్రాఫిక్స్‌తో కూడిన వీడియోలను రూపొందించడం వంటి ఎన్నో ప్రత్యేకతల కోసం జనార్ధన్ చానెల్‌ను ఫాలో కావాలని సుశాంత్ కోషీ ట్వీట్లో పేర్కొన్నారు.
Read More :
Indian Startups: ఎస్వీబీలో బిలియన్ డాలర్ల భారతీయ స్టార్టప్‌ల డిపాజిట్లు