Cargo ship Hijack | సోమాలియా తీరంలో కార్గో షిప్ హైజాక్.. భారతీయులతో సహా 21 మందిని కాపాడిన కమాండోలు
ఆఫ్రికా దేశమైన సోమాలియాలో అరేబియా సముద్ర తీరంలో గురువారం ఓ కార్గో నౌక హైజాక్‌కు గురైంది. లైబీరియా జెండాతో ఉన్న కార్గో నౌక ‘ఎంవీ లిలా నార్ఫోక్'లో 15 మంది భారతీయ సిబ్బంది ఉన్నారు. హైజాక్ సమాచారం అందిన వెంటనే రంగంలోకి దిగిన భారత నేవీ ప్రత్యేక ఆపరేషన్ చేపట్టింది. సముద్ర గస్తీ విధుల్లో ఉన్న ఐఎన్ఎస్ చెన్నైతో సహా మరో పెట్రోలింగ్ ఎయిర్‌క్రాఫ్ట్‌తో రంగంలోకి దిగింది.
- నౌక హెజాక్ కలకలం
- నౌకలో 15 మంది భారతీయ సిబ్బంది.. సమాచారంతో రంగంలోకి దిగిన నేవీ
- ఐఎన్ఎస్ చెన్నై, ఎయిర్‌క్రాఫ్ట్‌తో ప్రత్యేక ఆపరేషన్ చేపట్టిన నేవీ అధికారులు
Cargo ship Hijack | న్యూఢిల్లీ, జనవరి 5: ఆఫ్రికా దేశమైన సోమాలియాలో అరేబియా సముద్ర తీరంలో గురువారం ఓ కార్గో నౌక హైజాక్‌కు గురైంది. లైబీరియా జెండాతో ఉన్న కార్గో నౌక ‘ఎంవీ లిలా నార్ఫోక్’లో 15 మంది భారతీయ సిబ్బంది ఉన్నారు. హైజాక్ సమాచారం అందిన వెంటనే రంగంలోకి దిగిన భారత నేవీ ప్రత్యేక ఆపరేషన్ చేపట్టింది. సముద్ర గస్తీ విధుల్లో ఉన్న ఐఎన్ఎస్ చెన్నైతో సహా మరో పెట్రోలింగ్ ఎయిర్‌క్రాఫ్ట్‌తో రంగంలోకి దిగింది. శుక్రవారం సాయంత్రానికి హైజాక్ గురైన నౌక వద్దకు చేరుకొన్న అనంతరం.. భారత నేవీ కమాండోలు భారతీయ సిబ్బందితో సహా అందులో ఉన్న 21 మందిని సురక్షితంగా రక్షించారని భారత నేవీ అధికార ప్రతినిధి వివేక్ మధ్వాల్ పేర్కొన్నారు.
ఆ సమయానికి నౌకను హైజాగ్ చేసిన దుండగులు అందులో లేరని, అంతకుముందు చేసిన హెచ్చరికలతో పారిపోయారని కమాండోలు ధ్రువీకరించినట్టు నేవీ ఓ ప్రకటనలో పేర్కొన్నది. నౌక హైజాక్‌కు సంబంధించి యూకే మారిటైమ్ ఏజెన్సీ(యూకేఎంటీవో) నుంచి భారత నేవీకి గురువారం సాయంత్రం సమాచారం అందింది. నేవీ అధికారులు వెంటనే యుద్ధ నౌక ఐఎన్ఎస్ చెన్నైతో పాటు ఎయిర్‌క్రాఫ్ట్‌ను కూడా రంగంలోకి దింపారు. ముందుగా ఎయిర్‌క్రాఫ్ట్ సాయంతో నౌకలోని సిబ్బందితో కమ్యూనికేషన్ ఏర్పాటు చేసుకొన్నారు. అనంతరం హైజాక్‌కు గురైన నౌక వద్దకు చేరుకొన్న ఐఎన్ఎస్ చెన్నై.. హెలికాప్టర్‌ను ప్రయోగించి షిప్‌ను వదిలి వేయాలని హైజాక్ చేసిన సముద్ర దొంగలకు హెచ్చరిక చేసిందని అధికారులు తెలిపారు.
నౌకలోకి ఆరుగురు సాయుధ దుండగులు
సోమాలియా తూర్పు అరేబియా సముద్ర తీరానికి 300 నాటికల్ మైళ్ల దూరంలో సముద్రపు దొంగలు ఈ మర్చంట్ నౌకను హైజాక్ చేశారు. ఇది బ్రెజిల్‌లోని పోర్ట్ డు అకో నుంచి బహ్రెయిన్‌లోని ఖలిఫా బిన్ సల్మాన్‌కు వెళ్తున్నట్టు తెలుస్తున్నది. ఈ క్రమంలో గురువారం సాయంత్రం నౌకలోకి ప్రవేశించిన ఆరుగురు సాయుధ దుండగులు హైజాక్ చేసినట్టు తెలుస్తున్నది. హైజాక్‌కు గురైన వెంటనే నౌక సంబంధిత సమాచారాన్ని యూకేఎంటీవో పోర్టల్‌కు పంపింది. తర్వాత వెంటనే యూకే మారిటైమ్ ఏజెన్సీ అప్రమత్తం చేయడంతో భారత నేవీ ప్రత్యేక ఆపరేషన్ చేపట్టింది. పెట్రోలింగ్ ఎయిర్‌క్రాఫ్ట్ పీ81, ప్రిడేటర్ డ్రోన్ల సాయంతో నౌకపై నిరంతర నిఘా పెట్టింది. గత నెల గుజరాత్ సముద్ర తీరంలో ఒక కార్గో నౌకపై డ్రోన్ దాడి జరిగిన విషయం తెలిసిందే.
అమెరికా హెచ్చరికలను లెక్కచేయని హౌతీలు
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం నేపథ్యంలో హమాస్‌కు మద్దతు పలుకుతున్న యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారులు ఎర్రసముద్రంలో నౌకలను లక్ష్యంగా చేసుకొని వరుస దాడులకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. హౌతీలు నౌకలపై దాడులను ఆపాలని, లేకుండా తీవ్ర సైనిక చర్య ఎదుర్కోవాల్సి ఉంటుందని అమెరికా, పలు ఇతర మిత్రదేశాలు హెచ్చరించాయి. అయితే హెచ్చరించిన కొద్ది గంటలకే హౌతీలు.. యెమెన్ భూభాగం నుంచి ఎర్ర సముద్రంలోని నౌకలపైకి గురువారం మరోసారి డ్రోన్లను ప్రయోగించారు. ఈ డ్రోన్ ఎర్ర సముద్రంలోని అమెరికా నేవీ, వాణిజ్య నౌకలకు కొద్ది మైళ్ల దూరంలో పేలిందని పెంటగాన్ వర్గాలు వెల్లడించాయి. ఈ ఘటనలో ఎవరూ మరణించలేదని, నష్టం జరుగలేదని పేర్కొన్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

