నందిగ్రామ్‌లో సీఎం మమతపై దాడి

కోల్‌కతా : నందిగ్రామ్‌లో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీపై దాడి జరిగింది. ఎన్నికల ప్రచారానికి వెళ్లిన తనపై కొందరు దాడి చేశారని స్వయంగా మమతనే మీడియాకు వెల్లడించారు. నామినేషన్ వేసేందుకు వెళ్లిన సమయంలోనూ కొందరు తన కారు డోర్‌ను బలవంతంగా నెట్టారని.. దీంతో తాను లోపలోనే ఉండి పోవాల్సి వచ్చిందని ఆమె పేర్కొన్నారు. తనపై కుట్ర జరుగుతుందని ఆరోపించారు. ఘటనాస్థలంలో ఒక్క పోలీస్ కూడా లేకపోవడం అనుమానాలకు తావిస్తున్నదని మమత బెనర్జీ అన్నారు.
దాడిలో తన కాలికి గాయమైందని, ఛాతీనొప్పి సైతం తనను తీవ్రంగా బాధిస్తున్నదని వెల్లడించారు. తాను నందిగ్రామ్ నుంచి కోల్‌కతా వెళ్తున్నట్లు తెలిపారు. ఇదిలాఉండగా పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ మమత వ్యాఖ్యలను ఖండించారు. మమతా బెనర్జీ దాడి పేరుతో సానుభూతి సంపాదించేందుకు డ్రామా లాడుతుందని అన్నారు. ఘటనపై అవసరమైతే సీబీఐతో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. తృణమూల్ అధినేత్రిపై దాడి ఘటనపై ఆ పార్టీ శ్రేణులు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Munnuru Kapu | మున్నూరు కాపులకు అన్యాయం చేస్తే సహించేది లేదు : రాష్ట్ర కార్యదర్శి హెచ్చరిక
Virat Kohli: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ.. వన్డేల్లో 3వ పొజిషన్లో 13 వేల రన్స్
Ayushmann Khurrana | ఆయుష్మాన్ ఖురానాకు బెదిరింపు కాల్స్.. కోట్లు డిమాండ్ చేసిన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్.?
బ్యాంక్ తరలించొద్దని గ్రామస్తుల ధర్నా
జయశంకర్ భూపాలపల్లి జిల్లా డాన్సర్స్ యూనియన్ నూతన కమిటీ ఎంపిక
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

