గుజరాత్లో రూ.600 కోట్ల విలువైన హెరాయిన్ పట్టివేత
Drugs seized in Gujarat: గుజరాత్లో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. మోర్బీ జిల్లాలో గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్), స్థానిక పోలీసులు

అహ్మదాబాద్: గుజరాత్లో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. మోర్బీ జిల్లాలో గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్), స్థానిక పోలీసులు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్‌లో ముగ్గురు వ్యక్తులు డ్రగ్స్ తరలిస్తూ దొరికారు. దాంతో వారిని అదుపులోకి తీసుకున్న ఏటీఎస్ అధికారులు, వారి నుంచి 120 కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ మత్తుమందు విలువ దాదాపు రూ.600 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు.
గల్ఫ్ ఆఫ్ కచ్‌లోని నవ్లఖి పోర్టు సమీపంలోగల ఝింజుడా గ్రామంలో నిందితులు పట్టుబడ్డారు. నిందితులు పాకిస్థాన్ నుంచి సముద్ర మార్గాన డ్రగ్స్ తీసుకొచ్చినట్లు తమ ప్రాథమిక విచారణలో తేలిందని ఏటీఎస్ అధికారులు చెప్పారు. కాగా, మరోసారి డ్రగ్స్ ముఠా ఆటకట్టించిన గుజరాత్ పోలీసులను ఆ రాష్ట్ర హోంమంత్రి హర్ష్ సంఘవి అభినందించారు. హెరాయిన్ పట్టివేతకు సంబంధించిన పూర్తి వివరాలను డీజీపీ వెల్లడిస్తారని తెలిపారు. కాగా, రెండు నెలల క్రితం ముంద్రా పోర్టులో కూడా రూ.21 వేల కోట్ల విలువచేసే 3000 కిలోల డ్రగ్స్ పట్టుబడ్డాయి.
ATS apprehended three persons with 120 kg heroin worth Rs 600 crores. Preliminary investigation revealed that the consignment of heroin was brought by the accused via sea route where they had received a delivery from a Pakistani boat: DGP Ashish Bhatia pic.twitter.com/VQ4LEdfnQS
— ANI (@ANI) November 15, 2021
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

