Atishi | ఈడీ దాడుల్లో రూపాయి దొరకలేదు : ఢిల్లీ మంత్రి అతిషి
Atishi | మనీలాండరింగ్ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన బడా నేతల ఇండ్లపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడులు చేసింది. పది ప్రదేశాల్లో ఈడీ దాడులు చేపట్టింది. దాంతో పాటు ఢిల్లీ జల్ బోర్డు అవినీతి కేసులో ఈడీ దాడులు జరిపింది.
Atishi | మనీలాండరింగ్ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన బడా నేతల ఇండ్లపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడులు చేసింది. పది ప్రదేశాల్లో ఈడీ దాడులు చేపట్టింది. దాంతో పాటు ఢిల్లీ జల్ బోర్డు అవినీతి కేసులో ఈడీ దాడులు జరిపింది. ఈడీ దాడులపై ఢిల్లీ మంత్రి, ఆప్ నేత అతిషి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆప్ నేతలను కట్టడి చేసేందుకే దాడులు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. దాడుల్లో ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా దొరకలేదన్నారు. ఆప్ నేతలు, ఆప్‌తో అనుబంధం ఉన్న వ్యక్తులపై ఈడీ దాడులు జరుగుతున్నాయన్నారు.
ఆప్ కోశాధికారి, రాజ్యసభ సభ్యుడు ఎన్డీ గుప్తా, అరవింద్ కేజ్రీవాల్ పీఏ తదితరుల ఇళ్లపై దాడులు జరిగినట్లు పేర్కొన్నారు. కేంద్ర సంస్థల ద్వారా తమ గొంతును అణచివేయాలని బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. గత రెండేళ్లుగా మద్యం కుంభకోణం కేసు పేరుతో ఆప్ నేతలను బెదిరింపులకు గురి చేస్తున్నారని అతిషి అన్నారు. కొందరి ఇండ్లపై దాడులు చేస్తున్నారని.. మరికొందరికి సమన్లు జారీ చేస్తున్నారన్నారు. మరికొందరిని అరెస్టు చేశారన్నారు. గత రెండేళ్లలో వేల సంఖ్యలో దాడులు జరిగాయని తెలిపారు. అయితే, ఇప్పటి వరకు ఈడీ టీమ్ ఒక్క రూపాయి కూడా రికవరీ చేయలేదన్నారు. వచ్చే రెండేళ్లలో కూడా ఈడీకి ఏమి దొరకబోవన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | వర్షిణికి నాగార్జున గట్టి కౌంటర్.. దేబ్జానీకి క్లాస్, నరేష్‌కు షాక్!
Allahabad High Court | యూపీలో సిగ్గుచేటుగా పౌరస్వేచ్ఛ.. రాష్ట్ర హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
Sonia Gandhi | ఎమెర్జెన్సీ విధించడం పొరపాటు నిర్ణయం.. ఆత్మకథలో పేర్కొన్న సోనియా
Agniveer Scheme | మరో రెండేండ్ల సర్వీసు తర్వాత అగ్నివీరులకు పొడిగింపు
Supreme Court | ఓబీసీల పాత నియామకాలు, పదోన్నతులు కొనసాగించొచ్చు : సుప్రీంకోర్టు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

