12.08 నిమిషాలకు ఏటీసీతో తెగిన హెలికాప్టర్ లింక్: రాజ్‌నాథ్ సింగ్

న్యూఢిల్లీ: ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో సీడీఎస్ చీఫ్ బిపిన్ రావత్ మృతిచెందిన విషయం తెలిసిందే. దీనిపై ఇవాళ లోక్‌సభలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రకటన చేశారు. హెలికాప్టర్ ప్రమాదంలో 13 మంది మృతిచెందినట్లు ఆయన తెలిపారు. ప్రమాదంలో ప్రాణాలతో బయటపడ్డ గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ లైఫ్ సపోర్ట్‌పై ఉన్నారని, ఆయన్ను బ్రతికించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు. ప్రమాదంలో మరణించినవారికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నట్లు తెలిపారు. మిలిటరీ హెలికాప్టర్ ప్రమాదంలో బిపిన్ రావత్ దంపతులు ప్రాణాలు కోల్పోయినట్లు ఆయన వెల్లడించారు. వెల్లింగ్టన్ కాలేజీ స్టూడెంట్స్‌తో ఇంటరాక్ట్ అయ్యేందుకు అక్కడకు వెళ్లారన్నారు. సులూరు ఎయిర్‌బేస్ నుంచి హెలికాప్టర్ ఎగిరిందని, 12.08 నిమిషాలకు ఆ హెలికాప్టర్‌తో ఏటీసీ సంబంధాలు తెగిపోయాయన్నారు. అయితే మంటల్లో కాలిపోతున్న హెలికాప్టర్‌ను స్థానికులు చూశారని, దాంట్లో ప్రాణాలను కొట్టుమిట్టాడుతున్నవారిని కాపాడేందుకు స్థానికులు ప్రయత్నించినట్లు ఆయన తెలిపారు.
ప్రమాదంలో మృతిచెందిన రక్షణ దళ సిబ్బంది పేర్లను రాజ్‌నాథ్ చదివి వినిపించారు. పార్డీవ దేహాలను వైమానిక దళ విమానంలో ఇవాళ ఢిల్లీకి తీసుకురానున్నట్లు ఆయన చెప్పారు. ఎయిర్ చీఫ్ మార్షెల్ చౌదరీ నిన్ననే ఆ ప్రాంతానికి వెళ్లినట్లు తెలిపారు. ఘటనపై ట్రై సర్వీస్ ఎంక్వైరీకి ఆదేశించినట్లు చెప్పారు. ఎయిర్ మార్షల్ మనవేంద్ర సింగ్ నేతృత్వంలో విచారణ జరగనున్నది. విచారణ అధికారులు నిన్ననే వెల్లింగ్టన్ చేరారని, వాళ్లు దర్యాప్తు కూడా మొదలుపెట్టినట్లు చెప్పారు. పూర్తి సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు రాజ్‌నాథ్ తెలిపారు. స్పీకర్ ఓం బిర్లా కూడా నివాళి అర్పించారు. ఆ తర్వాత రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women’s Asian Champions Trophy | చైనాపై భారత్ ఘన విజయం.. ఆసియా హాకీ ఛాంపియన్‌గా హ్యాట్రిక్
Child Marriage | టెంకంపేట్లో బాల్యవివాహానికి బ్రేక్.. అధికారుల చొరవతో నిలిపివేత
Begumpet Students | సిద్దిపేట వైజ్ఞానిక ప్రదర్శనలో బేగంపేట విద్యార్థుల ప్రతిభ.. రాష్ట్రస్థాయికి స్మార్ట్ వాకర్ ప్రాజెక్టు
Myanmar military bombs school | స్కూల్‌పై మయన్మార్ ఆర్మీ బాంబు దాడి.. మహిళలు, పిల్లలతో సహా 30 మంది మృతి
ఓబీసీ కులగణన తర్వాతే డీలిమిటేషన్ చేపట్టాలి.. బీసీ మహిళలకు సబ్‌కోటా కల్పించాలి.. జాజుల శ్రీనివాస్ డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

