Man Fakes Wheelchair | యువకుడు వీల్‌చైర్ కోరాడు.. 2.15 కేజీల బంగారంతో పట్టుబడ్డాడు
Delhi Airport | ఒక యువకుడు ఎయిర్‌పోర్ట్‌లో వీల్‌చైర్ సహాయం కోరాడు (Man Fakes Wheelchair). అనుమానించిన సిబ్బంది అతడ్ని తనిఖీ చేయగా 2.15 కేజీల బంగారంతో పట్టుబడ్డాడు.
న్యూఢిల్లీ: ఒక యువకుడు ఎయిర్‌పోర్ట్‌లో వీల్‌చైర్ సహాయం కోరాడు (Man Fakes Wheelchair). అనుమానించిన సిబ్బంది అతడ్ని తనిఖీ చేయగా 2.15 కేజీల బంగారంతో పట్టుబడ్డాడు. దేశ రాజధాని ఢిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ సంఘటన జరిగింది. ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌కు చెందిన యువకుడు దుబాయ్‌లో పని చేస్తున్నాడు. రెండేళ్ల తర్వాత దేశానికి తిరిగివచ్చాడు. సోమవారం దుబాయ్ నుంచి విమానంలో ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్నాడు. అయితే కాలికి గాయమైనట్లు నటిస్తూ వీల్‌చైర్ సహాయం కోరాడు. దీంతో ఆ యువకుడి తీరుపై సెక్యూరిటీ సిబ్బంది అనుమానం వ్యక్తం చేశారు. అతడ్ని తనిఖీ చేయగా బూట్లలో దాచిన 2.15 కిలోల బంగారం లభించింది. దుబాయ్ నుంచి అక్రమంగా రవాణా చేసిన బంగారం పేస్ట్ విలువ రూ.1.13 కోట్లు ఉంటుందని కస్టమ్స్ అధికారులు తెలిపారు.
కాగా, బంగారం స్మగ్లింగ్ కోసం కొందరు ట్రావెల్ ఏజెంట్లు తనను ఆశపెట్టినట్లు ఆ యువకుడు తెలిపాడు. దుబాయ్ నుంచి భారత్‌కు విమాన టికెట్‌ను ఇవ్వడంతోపాటు ఎయిర్‌పోర్ట్‌లో వీల్‌చైర్ సహాయం కోరమని సలహా ఇచ్చినట్లు కస్టమ్స్ అధికారులకు చెప్పాడు. ఈ నేపథ్యంలో ఆ యువకుడ్ని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టగా 14 రోజులపాటు రిమాండ్ విధించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

