గువహటి : ప్రేమ గుడ్డిది.. అని చెప్పడానికి ఈ ఘటన నిదర్శనం. ప్రియుడి మీద తనకున్న ప్రేమను ఈ విధంగా చాటిచెప్పింది. ప్రియుడికి హెచ్ఐవీ పాజిటివ్ అని తెలిసీ కూడా.. అతన్ని రక్తాన్ని ప్రియురాలు ఎక్కించుకుంది. ఇప్పటికైనా తమ ప్రేమను అంగీకరించండి అని తల్లిదండ్రులను వేడుకుంది. ఈ ఘటన అసోంలోని సౌల్‌కుచి జిల్లాలో వెలుగు చూసింది.
ఓ 15 ఏండ్ల అమ్మాయికి ఫేస్బుక్లో ఓ యువకుడు పరిచయం అయ్యాడు. వారి పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఒకరికొకరు విడిచి ఉండలేనంతగా ఆ ప్రేమికుల బంధం బలపడింది. దీంతో ఆ అబ్బాయితో కలిసి ఆమె అనేకసార్లు వెళ్లిపోయింది. మళ్లీ తల్లిదండ్రులు ఆమెకు నచ్చజెప్పి ఇంటికి తీసుకొచ్చేవారు. ఇక లాభం లేదనుకొని ఈ సారి ఆ అమ్మాయి తన ప్రేమను మరో రూపంలో చెప్పింది. బాయ్ ఫ్రెండ్‌కు హెచ్ఐవీ పాజిటివ్ అని తెలిసినప్పటికీ అతని రక్తాన్ని సిరంజి ద్వారా బయటకు తీసింది. ఆ తర్వాత అదే రక్తాన్ని తన శరీరంలోకి ఇంజెక్టు చేసుకుంది ఆ అమ్మాయి. ఇప్పుడైనా తమ ప్రేమను అర్థం చేసుకోండి, అంగీకరించండి అని ఆమె తల్లిదండ్రులను ప్రాధేయపడింది.