Assam teacher | తరగతి గదిలో పోర్న్ చూడమని.. బాలికను బలవంతం చేసిన టీచర్
Assam teacher | తరగతి గదిలో పోర్న్ చూడమని బాలికను ఒక టీచర్ బలవంతం చేశాడు. (Assam teacher) ఆ విద్యార్థిని అసభ్యకరంగా తాకాడు. ఆ బాలిక దీని గురించి తల్లికి చెప్పింది. ఆగ్రహించిన స్థానికులు ఆ టీచర్‌పై దాడికి ప్రయత్నించగా తప్పించుకుని పారిపోయాడు. ఈ నేపథ్యంలో ఆ స్కూల్‌ను ధ్వంసం చేశారు.
గౌహతి: తరగతి గదిలో పోర్న్ చూడమని బాలికను ఒక టీచర్ బలవంతం చేశాడు. (Assam teacher) ఆ విద్యార్థిని అసభ్యకరంగా తాకాడు. ఆ బాలిక దీని గురించి తల్లికి చెప్పింది. ఆగ్రహించిన స్థానికులు ఆ టీచర్‌పై దాడికి ప్రయత్నించగా తప్పించుకుని పారిపోయాడు. ఈ నేపథ్యంలో ఆ స్కూల్‌ను ధ్వంసం చేశారు. అస్సాంలోని కరీంగంజ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఆగస్టు 12న ప్రభుత్వ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు ఒక విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. తరగతి గదిలో అశ్లీల చిత్రాలు చూడమని ఆమెను బలవంతం చేశాడు. ఆమెను అనుచితంగా తాకాడు.
కాగా, జరిగిన దాని గురించి తన కుటుంబానికి చెప్పేందుకు తొలుత ఆ బాలిక సంకోచించింది. చివరకు ఈ విషయాన్ని తల్లికి చెప్పింది. ఇది తెలుసుకున్న స్థానికులు ఆగ్రహంతో రగిలిపోయారు. ప్రభుత్వ స్కూల్ వద్దకు వెళ్లి ఆ టీచర్‌పై దాడికి యత్నించారు. అతడు తప్పించుకుని పారిపోవడంతో స్కూల్‌కు నిప్పుపెట్టారు.
మరోవైపు ఆ టీచర్‌పై పోక్సోతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న అతడ్ని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తునట్లు చెప్పారు. అలాగే ప్రభుత్వ స్కూల్ ఆస్తులకు స్థానికులు నష్టం కలిగించినందున వారిపై కూడా కేసు నమోదు చేస్తామని ఎస్పీ వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

