దిస్పూర్, ఏప్రిల్ 5: అస్సాంలోని కరీంగంజ్ జిల్లాకు చెందిన ఓ యువకుడు అంధుల కోసం స్మార్ట్ షూస్ తయారుచేశాడు. అనుకృత్ కర్మాకర్ అనే యువకుడు బూట్లకు సెన్సర్లు, ఓ బజర్ అమర్చాడు.
ఎదురుగా ఏదైనా ఉన్నా.. అడ్డంగా వచ్చినా వెంటనే సెన్సర్లు గుర్తించి బజర్ మోగేలా చేస్తుంది. ఆ బజర్ బూట్లు వేసుకున్న వ్యక్తికి వినిపించేలా మోగుతుంది. వెంటనే ఆ వ్యక్తి అప్రమత్తమవుతారు.