Cancer | అష్ట సూత్రాలతో క్యాన్సర్‌కు చెక్
క్యాన్సర్ మహమ్మారితో ప్రపంచవ్యాప్తంగా ఏటా కోటి మందికి పైగా మృత్యువాత పడుతున్నారు. ఈ నేపథ్యంలో ‘ప్రివెన్షన్ బెటర్ దాన్ క్యూర్' అనేది క్యాన్సర్ విషయంలో సరిగ్గా సరిపోతుందని అమెరికన్ క్యాన్సర్ సొసైటీ (ఏసీఎస్) పరిశోధకులు చెబుతున్నారు.
- ముందు జాగ్రత్తలతో ప్రతి ఇద్దరిలో ఒకరిని కాపాడొచ్చు
- అమెరికన్ క్యాన్సర్ సొసైటీ సూచనలు
- ప్రపంచంలో క్యాన్సర్ భూతం
- 18% మొత్తం మరణాల్లో వాటా
- 1,00,75,000 ఏటా మరణాలు
- 27,600 ఒక్కరోజులో సగటు మరణాలు
Cancer | హైదరాబాద్, జూలై 12 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): క్యాన్సర్ మహమ్మారితో ప్రపంచవ్యాప్తంగా ఏటా కోటి మందికి పైగా మృత్యువాత పడుతున్నారు. ఈ నేపథ్యంలో ‘ప్రివెన్షన్ బెటర్ దాన్ క్యూర్’ అనేది క్యాన్సర్ విషయంలో సరిగ్గా సరిపోతుందని అమెరికన్ క్యాన్సర్ సొసైటీ (ఏసీఎస్) పరిశోధకులు చెబుతున్నారు. వ్యాధి సోకిన తర్వాత చికిత్స తీసుకోవడం కంటే, వ్యాధి రాకముందే నివారణ చర్యలు ఆరంభించడం కీలకమని పేర్కొంటున్నారు. అందుకే, క్యాన్సర్ దరిచేరకుండా ఉండేందుకు 8 సూత్రాలను ఏసీఎస్ పరిశోధకులు ప్రకటించారు.
క్యాన్సర్ రాకుండా అష్ట నియమావళి
ధూమపానం వద్దు
ధూమపానం కారణంగా దాదాపు 16 రకాల క్యాన్సర్లు సోకే ప్రమాదమున్నది. ఊపిరితిత్తుల క్యాన్సర్, పెద్దపేగు క్యాన్సర్ ఇందులో ప్రధానమైనవి. ధూమపానం వల్ల పొగతాగే వారికే కాకుండా ఆ పొగను పీల్చే వారి కుటుంబసభ్యులకూ ప్రమాదమే.
స్థూలకాయమా? చూసుకోండి!
బరువు పెరుగడమూ క్యాన్సర్ సోకడానికి ఓ కారణంగా మారింది. కొవ్వు అధికంగా చేరడం, రక్తంలో ఇన్సులిన్ స్థాయిల్లో మార్పుతో అండాశయ క్యాన్సర్, కొలొరెక్టల్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉన్నది. మహిళల్లో 11 శాతం కేసులు, పురుషుల్లో 5% కేసులు ఈ క్యాటగిరీవే.
మద్యపానంతో ఇలా..
క్యాన్సర్ కొత్త కేసుల్లో 5.5%, మరణాల్లో 5.8% వాటా మద్యానిదే. మద్యం సేవించడం వల్ల కాలేయంతో పాటు డీఎన్ఏ కణాలు నాశనమవుతాయి. హార్మోన్ల సమతౌల్యం దెబ్బతింటుంది. ఫలితంగా నోటి క్యాన్సర్, అన్నవాహిక క్యాన్సర్, కాలేయ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, ఉదర క్యాన్సర్ రావొచ్చు.
ప్రాసెస్డ్ మాంసం వద్దు..
మాంసం నిల్వ ఉంచడానికి కొన్ని రసాయనాలను కలుపుతారు. ఇవి క్యాన్సర్ కారకాలుగా పనిచేస్తాయి. అలాంటి ప్రాసెస్డ్ ఫుడ్‌ను తీసుకోకపోవడమే మంచిది.
కూరగాయలు, పండ్లు తింటున్నారా?
ఫైబర్ ఎక్కువగా ఉండే ఆకుపచ్చని కూరగాయలు, తాజా పండ్లు, కాల్షియం లభించే ఆహారాన్ని తీసుకోవడం మరిచిపోవద్దు. వీటిని విస్మరిస్తే శరీరానికి అవసరమైన పోషకాలు అందకపోవడంతో ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. ఇది క్యాన్సర్ కణాల వృద్ధికి కారణమవ్వొచ్చు.
వ్యాయామం లేకపోవడం
శరీరాన్ని, మనసును చురుగ్గా ఉంచుకోవడానికి వ్యాయామం, యోగా వంటి సాధనాలను చేయాలి. క్యాన్సర్ కట్టడిలో ఇవి కూడా కీలకపాత్ర పోషిస్తాయి.
యూవీ రేడియేషన్
ఆల్ట్రావయోలెట్ (యూవీ) రేడియేషన్ కారణంగా చర్మకణాల్లోని డీఎన్ఏ నాశనమవుతుంది. ఇది చర్మ క్యాన్సర్‌కు కారణం కావొచ్చు. యూవీ రేడియేషన్ తగిలే ప్రాంతాలకు దూరంగా ఉండాలి.
ఈ వైరస్‌లూ ప్రమాదమే
ఎప్స్టీన్-బార్ వైరస్ (ఈబీవీ), హెలికోబ్యాక్టర్ పైలోరీ, హెపటైటిస్ బీ వైరస్ (హెచ్‌బీవీ), హెపటైటిస్ సీ వైరస్ (హెచ్‌సీవీ), హెచ్‌హెచ్‌వీ-8, హెచ్ఐవీ, హెచ్‌పీవీ తదితర వైరస్ల బారినపడ్డ వారికీ క్యాన్సర్ సోకే ప్రమాదం ఉన్నది. ఇవి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్‌రావు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

