Asaram Bapu | ఆసారాంకు జీవిత ఖైదు
Asaram Bapu | మహిళపై లైంగికదాడి కేసులో వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు ఆసారాం బాపుకు గాంధీనగర్ సెషన్స్ కోర్టు జీవిత ఖైదు విధించింది.
Asaram Bapu | మహిళపై లైంగికదాడి కేసులో వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు ఆసారాం బాపుకు గాంధీనగర్ సెషన్స్ కోర్టు జీవిత ఖైదు విధించింది. అహ్మదాబాద్ నగర శివారులోని అతడి ఆశ్రమంలో తనపై 2001 నుంచి 2006 వరకు పలు సందర్భాల్లో లైంగికదాడికి పాల్పడినట్టు బాధిత మహిళ 2013లో ఆసారాం బాపుపై చాంద్ఖేడా ఠాణాలో ఫిర్యాదు చేసింది. ఈ కేసులో అతడికి మరో ఆరుగురు సహకరించినట్టు పేర్కొన్నది.
ఈ కేసుపై విచారణ జరిపిన ధర్మాసనం.. ఆసారాం బాపును దోషిగా నిర్ధారించింది. ఆసారాం భార్యతో పాటు ఐదుగురిని నిర్ధోషులుగా ప్రకటిస్తూ కోర్టు సోమవారం తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా ఆసారం బాపుకు జీవిత ఖైదు విధించింది. కాగా, మరో రేప్ కేసులో ఆసారాం ఇప్పటికే జోద్పూర్ జైలులో ఉన్నారు. ఆసారాంకు దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో భక్తులు ఉన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

