Drugs Case | డ్రగ్ కేసు దర్యాప్తు వేగవంతం.. ఆర్యన్‌ఖాన్‌కు విచారణకు పిలిచిన ఎన్సీబీ
Aryan Khan | ముంబై క్రూయిజ్ డ్రగ్ కేసును నార్కోటిక్స్ బ్యూరో వేగవంతం చేసింది. కేసు విచారణ ముంబై నుంచి ఢిల్లీ ప్రధాన కార్యాలయానికి

న్యూఢిల్లీ : ముంబై క్రూయిజ్ షిప్ డ్రగ్ కేసును నార్కోటిక్స్ బ్యూరో వేగవంతం చేసింది. కేసు విచారణ ముంబై నుంచి ఢిల్లీ ప్రధాన కార్యాలయానికి మారగా.. నిందితులందరినీ ఎస్సీబీ సిట్ మళ్లీ విచారణకు పిలువనున్నది. దర్యాప్తు సంస్థ ఇప్పటికే ఆర్యన్‌ఖాన్‌తో పాటు అతని స్నేహితులు అర్బాజ్ మర్చంట్, అచిత్కుమార్ను విచారణకు పిలిచింది. ఈ క్రమంలో ఇద్దరూ ఇవాళ ఎన్సీబీ కార్యాలయానికి చేరుకున్నారు. ఎన్సీబీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ సంజయ్‌కుమార్ సింగ్ నేతృత్వంలో ఏజెన్సీ సమన్లు పంపగా.. సిట్ ఎదుట విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక బంధువు సమీర్‌ను కూడా ప్రశ్నించనున్నట్లు సమాచారం.
ఢిల్లీలోని ఎన్సీబీ హెడ్‌క్వార్టర్స్‌లోని ఆపరేషన్స్ బ్రాంచ్‌కు చెందిన ఆరుగురు సభ్యులు సిట్ బృందం శనివారం రాత్రి ముంబైలోని కార్డెలియా క్రూజ్‌ను పరిశీలించింది. డ్రగ్ కేసును తమ ఆధీనంలోకి తీసుకునేందుకు శనివారం అధికారుల బృందం ముంబైకి చేరుకున్నది. ఈ సందర్భంగా ఎన్సీబీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ సంజయ్‌కుమార్ సింగ్ మాట్లాడుతూ ఆరు కేసులను తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. కేసుల దర్యాప్తులో ముంబై జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే సహాయం తీసుకుంటామని తెలిపారు. పలు ఆరోపణల నేపథ్యంలో సమీర్‌ను విచారణ నుంచి తప్పించినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
అయితే, ఈ వార్తలను ఎన్సీబీ ఖండించింది. విచారణ నుంచి ఏ అధికారిని తొలగించలేదని స్పష్టం చేసింది. కేసులో ఎన్సీబీ ముంబై యూనిట్‌కు చెందిన అధికారులు అవసరమైన విధంగా దర్యాప్తులో సహకరిస్తారని పేర్కొంది. ఇదిలా ఉండగా.. డ్రగ్స్ కేసులో అరెస్టయిన బాలీవుడ్ బాద్షా షారుఖ్‌ఖాన్ తనయుడు ఆర్యన్‌ఖాన్ 26 రోజుల కస్టడీ తర్వాత బాంబే హైకోర్టు అక్టోబర్ 28న బెయిల్ మంజూరు చేసింది. అక్టోబర్ 2న గోవాకు వెళ్తున్న కోర్డెలియా క్రూయిజ్ షిప్‌పై ఎన్సీబీ దాడి చేసి.. ఆర్యన్‌ఖాన్ అర్బాజ్ మర్చంట్, మన్మున్ ధమేచాను అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత 7 నుంచి ఆర్యన్, అర్బాజ్ ఆర్థర్ రోడ్ జైలులో, మున్మున్ ధమేచాను బైకుల్లా మహిళా జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Auto | చెట్లు నాటి తిరిగొస్తుండగా.. టిప్పర్‌ను ఢీకొట్టిన కూలీల ఆటో
DADA | డిసెంబర్ 24న దాదా ధమాకా.. నవంబర్ 13న ఫస్ట్ సాంగ్, థమన్ మ్యూజిక్‌తో టాలీవుడ్లో భారీ హైప్!
iQOO | 10,000mAh బ్యాటరీతో iQOO కొత్త ఫోన్.. 7 ఇంచుల భారీ డిస్ప్లే కూడా!
Rajeev Kanakala | ఎన్టీఆర్ అప్పుడే స్టార్ అవుతాడని చెప్పా, 25 ఏళ్లు గడిచినా మారలేదు.. రాజీవ్ కనకాల ఆసక్తికర వ్యాఖ్యలు!
Dakshinamukhi Anjaneya Swamy | పార్డి (కె) గ్రామంలో ముగిసిన అఖండ హరినామ తాళ సప్తహ వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

