Arvind Kejriwal | డబుల్ ఇంజిన్ ప్రభుత్వమంటే.. డబుల్ లూటీ.. బీజేపీపై కేజ్రీవాల్ విమర్శలు
Arvind Kejriwal | డబుల్ ఇంజిన్ ప్రభుత్వమంటే.. డబుల్ లూటీ అంటూ ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అధికార బీజేపీపై విమర్శలు గుప్పించారు. ఢిల్లీలోని ఛత్రసాల్ స్టేడియంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఆదివారం జనతా కీ అదాలత్ కార్యక్రమం నిర్వహించింది.
Arvind Kejriwal | డబుల్ ఇంజిన్ ప్రభుత్వమంటే.. డబుల్ లూటీ అంటూ ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అధికార బీజేపీపై విమర్శలు గుప్పించారు. ఢిల్లీలోని ఛత్రసాల్ స్టేడియంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఆదివారం జనతా కీ అదాలత్ కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా మాజీ సీఎం మాట్లాడుతూ ఢిల్లీ ప్రజల ప్రేమ, మద్దతు, నమ్మకమే నా నిజాయితీకి నిదర్శనమన్నారు. యూపీలో గత ఏడేళ్లుగా డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఉందని.. అక్కడ విఫలమయ్యారన్నారు. 22 రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలు ఉన్నాయని.. ఉచిత విద్యుత్ అందిస్తున్న రాష్ట్రం పేరు చెప్పమని వారిని అడగాలన్నారు. గుజరాత్లో 30 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నారని.. అక్కడ ఒక్క బడిని కూడా బాగు చేయలేదంటూ విమర్శించారు. అధికారంలో ఉన్న 22 రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఉన్నాయని.. అక్కడ చేసిన మంచి పని ఒక్కటి చెప్పాలన్నారు.
వచ్చే ఏడాది సెప్టెంబర్ 17న ప్రధాని నరేంద్ర మోదీ రిటైర్ అవుతారన్నారు. ఢిల్లీలో చేసిన ఏ ఒక్క పనైనా 22 రాష్ట్రాల్లో ఒక్క ఏడాదిలో చేయాలన్నారు. పదేళ్లలో చేసింది ఏమీ లేదని.. 11వ సంవత్సరంలోనైనా ఏదో చేశారనుకుంటారన్నారు. ఢిల్లీ ఎన్నికలు ఫిబ్రవరిలో జరుగుతాయని తాను ప్రధానికి చెబుతున్నానని.. ఫిబ్రవరిలో 22 రాష్ట్రాల్లో ఒక్కడో ఒక చోట ఉచిత విద్యుత్ ఇవ్వాలన్నారు. అలా చేస్తే తానే ఎన్నికల్లో మోదీకి ప్రచారం చేస్తానన్నారు. ఢిల్లీ సీఎం అతిషీ మాట్లాడుతూ అత్యంత వేడిలోనూ 24 గంటలు కరెంటు అందుబాటులో ఉన్న ఏకైక ప్రదేశం ఢిల్లీ మాత్రమేనన్నారు. అయినా బిల్లులు జీరో వచ్చాయన్నారు. ఇది అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ అని.. బీజేపీ వ్యతిరేక పార్టీ అన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలోని మురికివాడలను ఒక్కొక్కటిగా కూల్చివేస్తోందన్నారు. ఆరు నెలల కిందట వృద్ధాప్య పింఛను నిలిపివేసిందని విమర్శించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్బండ్పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

