Dibang Valley Waterfall | ఏడాదిలో కనీసం ఒక్కసారైనా అలా జలపాతాల దగ్గరకెళ్లి.. దివి నుంచి భువికి జాలువారే నీటి అందాలను చూడాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. సాధారణంగా జలపాతాలన్నీ కూడా ప్రకృతి సిద్ధమైనవే. కాకపోతే ఒక్కో జలపాతానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. వర్షా కాలంలో అవి చేసే కనువిందు మాటల్లో వర్ణించలేం. జలసవ్వడులతో కొండల మధ్యనుంచి జాలువారుతూ ఆకర్షిస్తుంటాయి. అయితే, మనం ఎక్కువగా నయాగరా వాటర్‌ఫాల్స్ గురించే వింటుంటాం. నయాగరా అంత కాకపోయినా.. కనువిందు చేసే జలపాతాలు మనదేశంలోనూ చాలానే ఉన్నాయి. అలాంటి జలపాతాల్లో అరుణాచల్ ప్రదేశ్‌లోని దిబంగ్ వ్యాలీ వాటర్‌ఫాల్స్ ఒకటి.
ఈ జలపాతం ప్రస్తుతం ప్రకృతి ప్రేమికుల్ని విపరీతంగా ఆకట్టుకుంటోంది. పాలధారలా కొండపై నుంచి కిందకు జాలువారుతూ నెటిజన్లను విశేషంగా ఆకర్షిస్తోంది. పాలా..? నీళ్లా..? అని భ్రమపడేలా ఉన్న ఈ జలపాతానికి సంబంధించిన వీడియోను అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పేమ ఖాండ ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు. ‘దేఖో అప్నా దేశ్’ క్యాంపెయిన్‌లో భాగంగా ఆయన ఈ వీడియోను షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు ‘వావ్.. బ్యూటిఫుల్’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
Majestic appeal, panoramic view, rejuvenating ambience and spectacular surroundings make Zawru Valley a place not to miss at all.
If you have not been to Anini, then you must welcome #NewYear by being in the lap of Mother Nature in our pristine Dibang Valley !#DekhoApnaDesh pic.twitter.com/rzDviyfNlq
— Pema Khandu པདྨ་མཁའ་འགྲོ་། (@PemaKhanduBJP) November 28, 2022