సుమీలో 600 మంది… ఉక్రెయిన్ పొరుగు దేశాల్లో 3 వేల మంది భారతీయులు: మురళీధరన్
న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌లోని సుమీలో సుమారు 600 మంది భారతీయ విద్యార్థులు ఉన్నారని కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి వీ మురళీధరన్ తెలిపారు. అలాగే ఉక్రెయిన్ నుంచి పొరుగు దేశాలకు చేరిన వారిలో మూడు వేల మంది భారత పౌరులు ఉన్నట్లు చెప్పారు. వీరిని అక్కడి నుంచి తరలించేందుకు ఎంబసీ ఏర్పాట్లు చేస్తున్నదని అన్నారు. ఉక్రెయిన్‌లోని 20 వేల మంది భారతీయుల్లో ఇప్పటి వరకు 16 వేలకుపైగా పౌరులను స్వదేశానికి తీసుకొచ్చినట్లు ఆయన వివరించారు.
మరోవైపు ఉక్రెయిన్ పొరుగు దేశాల నుంచి కొంత మంది విద్యార్థులు సోమవారం ప్రత్యేక విమానాల్లో ఢిల్లీకి తిరిగి వచ్చారు. తమ వారిని చూసి కొందరు తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. ఉక్రెయిన్‌లో తాము పడిన కష్టాల గురించి కొంతమంది విద్యార్థులు మీడియా ఎదుట వాపోయారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడికి దిగిన ఫిబ్రవరి 24 నుంచి మార్చి 2 వరకు తాము బంకర్లలో ఉన్నట్లు ప్రియా తెలిపారు. ఖార్కివ్‌లో చిక్కుకున్న తాము ఆహారం లేక చాలా అవస్థలు పడినట్లు చెప్పారు. చివరకు మార్చి 2న అతికష్టం మీద రైలులో ప్రయాణించి పొరుగు దేశానికి చేరినట్లు చెప్పారు.

కాగా, ఉక్రెయిన్ను వీడే భారతీయులను రైళ్లలో ప్రయాణానికి అనుమతించకపోవడంతో చాలా ఇబ్బంది పడినట్లు ప్రియా తెలిపారు. సుమీలో చిక్కుకున్న వందలాది మంది భారతీయ విద్యార్థుల పరిస్థితి చాలా దయనీయంగా ఉన్నదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. వారిని వెంటనే అక్కడి నుంచి తరలించేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
Prashanth Neel | భయపెట్టేందుకు వస్తున్న ప్రశాంత్ నీల్ ‘418’.. ఆసక్తికరంగా ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

