Poonch | పూంచ్ సెక్టార్లో అక్రమ చొరబాటుకు ముగ్గురు ఉగ్రవాదుల యత్నం.. కాల్పుల్లో గాయపడిన భారత జవాన్
జమ్ముకశ్మీర్‌లోని పూంచ్ (Poonch) సెక్టార్లో దేశంలోకి అక్రమంగా చొరబడేందుకు ప్రయత్నించిన ముగ్గురు ఉగ్రవాదులను (Terrorists) సైన్యం అడ్డుకున్నది. శుక్రవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత పూంచ్ జిల్లాలోని గుల్పూర్ సెక్టార్లో (Gulpur sector) ఉన్న నల్లా ప్రాంతంలో సాయుధులైన ముగ్గురు ఉగ్రవాదులు నియంత్రణ రేఖ (LoC) దాటేందుకు యత్నించారు.
శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లోని పూంచ్ (Poonch) సెక్టార్లో దేశంలోకి అక్రమంగా చొరబడేందుకు ప్రయత్నించిన ముగ్గురు ఉగ్రవాదులను (Terrorists) సైన్యం అడ్డుకున్నది. శుక్రవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత పూంచ్ జిల్లాలోని గుల్పూర్ సెక్టార్లో (Gulpur sector) ఉన్న నల్లా ప్రాంతంలో సాయుధులైన ముగ్గురు ఉగ్రవాదులు నియంత్రణ రేఖ (LoC) దాటేందుకు యత్నించారు. గుర్తించిన సైన్యం.. వారిపై కాల్పులు జరిపింది. ప్రతిగా వారు కాల్పులకు తెగబడటంతో ఓ సైనికుడు (Soldier) గాయపడ్డాడని అధికారులు తెలిపారు.
చికటి కమ్ముకోవడంతో ఎల్వోసీ దాటడానికి భారీ ఆయుధ సామాగ్రి కలిగిన ముగ్గురు ఉగ్రవాదులు ప్రయత్నించారని చెప్పారు. అయితే సైన్యం వారిని అడ్డుకోవడంతో కాల్పులు జరిపారన్నారు. సైనికులు కాల్పులు జరపడంతో సమీపంలో ఉన్న దట్టమైన అడవుల్లోకి ముగ్గురు ఉగ్రవాదులు పారిపోయారని తెలిపారు. దీంతో ఆ ప్రాంతాన్ని సైన్యం చుట్టుముట్టిందని, ఉగ్రవాదుల కోసం ముమ్మరంగా గాలింపు చేపట్టామని వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

