Defense Expo | స్వదేశీ ఆయుధాలతోనే భవిష్యత్ యుద్ధాల్లో గెలుస్తాం : ఆర్మీ చీఫ్
Defense Expo-2022 | దేశీయ ఆయుధసంపత్తిపై ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్‌పాండే విశ్వాసం వ్యక్తం చేశారు. గుజరాత్ గాంధీనగర్‌లో జరుగుతున్న డిఫెన్స్ ఎక్స్పో-2022లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన ఆయుధాలు మిలటరీకి
Defense Expo-2022 | దేశీయ ఆయుధసంపత్తిపై ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్‌పాండే విశ్వాసం వ్యక్తం చేశారు. గుజరాత్ గాంధీనగర్‌లో జరుగుతున్న డిఫెన్స్ ఎక్స్పో-2022లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన ఆయుధాలు మిలటరీకి అండగా నిలిచాయని, ఈ ఆయుధ బలంతోనే భవిష్యత్తులో జరిగే యుద్ధంలో విజయం సాధిస్తామని స్పష్టంగా చెప్పగలమన్నారు. దేశీయ సాంకేతికతతో తయారు చేసిన ఆయుధాలు ఫార్వర్డ్ పోస్టుల్లో భాగా పని చేశాయని చెప్పారు. ప్రపంచ మార్కెట్లో లభించే ఇతర ఆయుధాల మాదిరిగానే ఇవి కూడా మెరుగైనవన్నారు.
రష్యా – ఉక్రెయిన్ యుద్ధం తమకు గుణపాఠం చెప్పిందన్నారు. సాధ్యమైనంత వరకు ఆయుధ సరఫరా గొలుసుపై ఆధారపడకూదని, స్వావలంభన ఉండాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. మేక్-1 ప్రాజెక్టుల్లో రెండు, మూడు ప్రాజెక్టులున్నాయని తెలిపారు. వీటిలో లైట్ ట్యాంకులు, సాయుధ వాహనాలు ఉన్నాయని, వీటికి ప్రభుత్వం పాక్షికంగా నిధులు సమకూరుస్తుందని పేర్కొన్నారు. మేక్-2 కేటగిరిలో 43 ప్రాజెక్టులున్నాయని, వీటిలో 187 పరిశ్రమలు పాల్గొంటున్నాయన్నారు. దీని విలువ రూ.27వేలకోట్లు అని, ప్రధానంగా ఇప్రూవ్ ఇంటిలిజెన్స్, నిఘా సామర్థ్యాలను మెరుగుపరచడంతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాజెక్టుపై సైతం దృష్టి సారిస్తున్నట్లు వివరించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Uttar Pradesh | యూపీలో మంటల్లో చిక్కుకున్న కారు.. చిన్నారి సహా ఆరుగురు సజీవదహనం
Vaibhav Sooryavanshi: ఐపీఎల్ 2026 సూపర్ స్ట్రయికర్.. కొత్త కారు అందుకున్న వైభవ్ సూర్యవంశీ
Sharwanand | శర్వానంద్ ‘భోగి’ మళ్లీ వాయిదా పడనుందా .. ఇంకా క్లారిటీ ఇవ్వని మేకర్స్!
Gas cylinder | మేడ్చల్‌లో పేలిన గ్యాస్ సిలిండర్ .. తృటి తప్పిన పెను ప్రమాదం
Katrina Kaif | దీపావళికి కత్రినా కైఫ్ స్పెషల్ గిఫ్ట్.. తొలిసారి కొడుకు విహాన్ ఫొటో షేర్ చేసిన స్టార్ కపుల్!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

