Army Chief | ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే పదవీకాలం పొడిగింపు
Army Chief | ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే పదవీకాలాన్ని కేంద్రం నెల రోజులు పొడిగించింది. ఆయన పదవీకాలం పొడిగింపునకు కేబినెట్ అపాయింట్మెంట్ కమిటీ ఆదివారం ఆమోదం తెలిపింది. జనరల్ మనోజ్ పాండే జూన్ 30 వరకు ఆర్మీ చీఫ్‌గా కొనసాగనున్నారు.
Army Chief | ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే పదవీకాలాన్ని కేంద్రం నెల రోజులు పొడిగించింది. ఆయన పదవీకాలం పొడిగింపునకు కేబినెట్ అపాయింట్మెంట్ కమిటీ ఆదివారం ఆమోదం తెలిపింది. జనరల్ మనోజ్ పాండే జూన్ 30 వరకు ఆర్మీ చీఫ్‌గా కొనసాగనున్నారు. వాస్తవానికి ఆయన ఈ నెల 31న పదవీ విరమణ చేయాల్సి ఉంది. గతంలోనూ కేంద్రం పదవీకాలాన్ని కొనసాగించింది. ఆయన ఏప్రిల్ 30, 2022న ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించారు. జనరల్ ఎంఎం నరవణే స్థానంలో ఆర్మీ చీఫ్‌గా నియామకమయ్యారు.
అంతకు ముందు ఆయన కార్ప్స్ ఆఫ్ ఇంజినీర్స్ ఆర్మీ చీఫ్ అయిన తొలిసారి అధికారి మనోజ్ పాండే. ఇప్పటి వరకు, ఎక్కువగా పదాతిదళం, ఆర్మర్డ్ అండ్ ఆర్టిలరీ అధికారులు ఆర్మీ చీఫ్లుగా పని చేశారు. పాండే తూర్పు ఆర్మీ కమాండర్‌గా కూడా పని చేశారు. ఈశాన్య రాష్ట్రాలైన సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతాల్లో చైనాతో ఉన్న వాస్తవ నియంత్రణ రేఖను (LAC) ఈ కమాండ్ మోహరించింది. దీని ప్రధాన కార్యాలయం కోల్‌కతాలో ఉంది. లెఫ్టినెంట్ జనరల్ పాండే తూర్పు కమాండ్ అధిపతిగా బాధ్యతలు స్వీకరించడానికి ముందు అండమాన్ అండ్ నికోబార్ కమాండ్ కమాండర్ ఇన్ చీఫ్‌గా సేవలు అందించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

