watch: గన్స్‌తో కాల్పులు జరిపి.. నగల వ్యాపారుల నుంచి బ్యాగ్ లాక్కెళ్లిన దుండగులు
Armed Robbers Fire Gunshots | బైక్‌లపై వచ్చిన కొందరు దుండగులు గన్స్‌తో కాల్పులు జరిపి బెదిరించారు. నగల వ్యాపారుల వద్ద ఉన్న బ్యాగ్‌ను లాక్కొని పారిపోయారు. (Armed Robbers Fire Gunshots) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
న్యూఢిల్లీ: బైక్‌లపై వచ్చిన కొందరు దుండగులు గన్స్‌తో కాల్పులు జరిపి బెదిరించారు. నగల వ్యాపారుల వద్ద ఉన్న బ్యాగ్‌ను లాక్కొని పారిపోయారు. (Armed Robbers Fire Gunshots) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. ఆదివారం రాత్రి 9 గంటలకు రద్దీగా ఉన్న సోనియా విహార్ ప్రాంతానికి నలుగురు వ్యక్తులు రెండు బైక్‌లపై చేరుకున్నారు. ముఖాలకు హెల్మెట్లు ధరించిన ఆ వ్యక్తులు రోడ్డు పక్కగా నడుస్తున్న నగల వ్యాపారి, అతడి కొడుకును గన్స్‌తో కొట్టారు. గాల్లోకి కాల్పులు జరిపి వారిని బెదిరించారు. నగల వ్యాపారి వద్ద ఉన్న బ్యాగ్‌ను లాక్కొన్నారు.
కాగా, దుండగులు బైక్స్‌పై పారిపోయేందుకు ప్రయత్నించగా బాధిత నగల వ్యాపారి ఒక వ్యక్తిని వెనుక నుంచి పట్టుకున్నాడు. దీంతో మిగతా వారు బైక్ దిగి వచ్చారు. ఆ వ్యక్తిని దారుణంగా కొట్టారు. అలాగే కాల్పులు జరిపి బెదిరిస్తూ బ్యాగ్‌తో సహా అక్కడి నుంచి పారిపోయారు. ఇది చూసి అక్కడి వారు షాక్ అయ్యారు. మరోవైపు ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఢిల్లీలో నేరాలు పెరుగతుండటంతో పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి.
Video caution ⚠️
देखिए दिल्ली में बेखौफ बदमाश लूट के लिए गोलियां चला रहे हैंसोनिया विहार डकैती के प्रयास का मामले का सीसीटीवी आया सामने जिसमे दिखाई दे रहा है कि बदमाश कैसे पिता और बेटे के साथ उनका बैग छीनने की कोशिश कर रहे है जब विरोध किया तो उनके सर पर पिस्टल की बट से वार… pic.twitter.com/n9ws0AWQgG
— Lavely Bakshi 🔺 (@lavelybakshi) February 19, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Armed Robbers
- Bag
- Delhi
- fire
RELATED ARTICLES
తాజా వార్తలు
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

