వాషింగ్టన్, జూలై 18: గాయాలపాలైన గుండె స్థానంలో కృత్రిమ గుండె అమర్చే పద్దతులు అమల్లోకి వచ్చాయి. ఈ ఆపరేషన్లలో కూడా కొన్నిసార్లు సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో బయోహైబ్రిడ్ మోడల్ హృదయాన్ని మసాచుసెట్స్‌లోని హార్వర్డ్ జాన్ ఏ పౌల్సన్ స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్
ఐప్లెడ్ సైన్సెస్ పరిశోధకులు అభివృద్ధి చేశారు. హృదయ కణాలతో తయారుచేసిన జఠరికలు, కండరాల కదలికలకు అనుగుణంగా పనిచేసే కృత్రిమ ధమనులతో ఈ హృదయం రక్తాన్ని క్రమరీతిలో పంపింగ్ చేస్తుందని పేర్కొన్నారు. చిన్న చిన్న గాయాలను కూడా ఈ గుండె స్వంతగా నయం చేసుకోగలదని తెలిపారు.