Another Pee-Gate | న్యూయార్క్-న్యూఢిల్లీ విమానంలో తోటి ప్రయాణికుడిపై విద్యార్థి మూత్ర విసర్జన
Another Pee-Gate | శుక్రవారం రాత్రి 9.16 గంటలకు న్యూయార్క్ నుంచి ఢిల్లీకి బయలుదేరిన అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానంలో ఓ విద్యార్థి తోటి ప్రయాణికుడిపై మూత్ర విసర్జన చేశాడు. తాగిన మత్తుతో నిద్రలోకి జారుకున్న ఓ విద్యార్థి నిద్రలోనే మూత్ర విసర్జన చేశాడు. తన సీట్లోంచి కొంత మూత్రం లీకై పక్కనున్న ప్రయాణికుడి సీట్లో పడింది.
న్యూఢిల్లీ: మళ్లీ అదే సీన్ రిపీట్ అయ్యింది. ఇటీవల ఎయిర్ ఇండియా విమానంలో ఓ వ్యక్తి తోటి ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన చేసిన ఘటనను మరువకముందే అలాంటిదే మరో ఘటన చోటుచేసుకుంది. శుక్రవారం రాత్రి 9.16 గంటలకు న్యూయార్క్ నుంచి ఢిల్లీకి బయలుదేరిన అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానంలో ఓ విద్యార్థి తోటి ప్రయాణికుడిపై మూత్ర విసర్జన చేశాడు.
తాగిన మత్తుతో నిద్రలోకి జారుకున్న ఓ విద్యార్థి నిద్రలోనే మూత్ర విసర్జన చేశాడు. తన సీట్లోంచి కొంత మూత్రం లీకై పక్కనున్న ప్రయాణికుడి సీట్లో పడింది. మూత్రం పోసిన విద్యార్థి అమెరికాలోని ఓ యూనివర్సిటీలో చదువుకుంటున్నట్లు చెప్పాడు. తోటి ప్రయాణికుడికి అతడు క్షమాపణలు చెప్పాడు. ఫిర్యాదు చేస్తే విద్యార్థి కెరీర్ పాడవుతుందన్న ఉద్దేశంతో బాధితుడు ఎవరికీ ఫిర్యాదు చేయలేదు.
అయితే, విమాన సిబ్బంది మాత్రం ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు కంప్లెయింట్ చేశారు. దాంతో విమానం శనివారం రాత్రి 10.12 గంటలకు ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోగానే సీఐఎస్ఎఫ్ సిబ్బంది మూత్ర విసర్జన చేసిన విద్యార్థిని అదుపులోకి తీసుకున్నారు.
కాగా, ఈ ఘటనకు సంబంధించి పోలీసులు పలువురి స్టేట్మెంట్స్ తీసుకున్నట్లు ఎయిర్‌పోర్టు వర్గాలు వెల్లడించాయి. పౌర విమానయాన నిబంధనల ప్రకారం.. తోటి ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేసినట్టు రుజువైతే నిందితుడిపై క్రిమినల్ కేసు పెట్టే అవకాశం ఉంటుంది. కొంత కాలంపాటు ప్రయాణాలు చేయకుండా వారిపై నిషేధం విధించవచ్చు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎంజీయూ అసిస్టెంట్ ప్రొఫెసర్ అరుణ ప్రియ సంపాదకంలో డిగ్రీ ఆంగ్ల పాఠ్య పుస్తక రూపకల్పన
Jordan Church | జోర్డాన్ చర్చిలో ఏకే-47 రైఫిల్‌తో కాల్పులు.. ఏడుగురు మృతి.. 10 మందికి గాయాలు
భూ సమస్యలకు త్వరలోనే పరిష్కారం : కలెక్టర్ చంద్రశేఖర్
CJP leaders | మమ్మల్ని అరెస్టు చేసినా ఉద్యమం ఆగదు.. సౌరవ్ దాస్, రాంకా వెల్లడి.. క్రైమ్ బ్రాంచ్ ఎదుట హాజరు
అమెరికాలో భార్యను హత్య చేసిన భారత సంతతి వ్యక్తి.. ఐసీఈ ఏజెంట్లు ఆమెను కిడ్నాప్ చేసినట్లు ఆరోపణ
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

