న్యూఢిల్లీ: దిగ్గజ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్ అందుబాటులోకి రానున్నది. యూజర్లు వాట్సాప్‌లో ఆడియో, వీడియో కాల్స్‌ను షెడ్యూల్ చేసుకోవచ్చు. అంటే వాట్సాప్ గ్రూప్‌లోని సభ్యులకు ఎప్పుడు ఆడియో లేదా వీడియో కాల్ వెళ్లాలో ముందుగానే సెట్ చేసుకోవచ్చు.
వీడియో/ఆడియో కాల్ ఐకాన్‌పై క్లిక్ చేయడం ద్వారా మీటింగ్ పేరు, తేదీ, సమయం వంటి వివరాలను ఎంటర్ చేసి క్రియేట్‌పై క్లిక్ చేస్తే కాల్ షెడ్యూల్ అవుతుంది. కాల్ ప్రారంభమైన వెంటనే గ్రూపు సభ్యులందరికీ అలర్ట్ నోటిఫికేషన్ వెళుతుంది. ప్రస్తుతం పరీక్షల దశలో ఉన్న ఈ ఫీచర్‌ను ముందుగా బీటా యూజర్లకు అందుబాటులోకి తీసుకురానున్నారు.