ICMR | సంతాన నియంత్రణ ఇంజెక్షన్.. పురుషుల కోసం అభివృద్ధి చేసిన ఐసీఎంఆర్
పిల్లలు పుట్టకుండా పురుషులకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న సంతాన నియంత్రణ విధానం వ్యాసెక్టమీకి ప్రత్యామ్నాయంగా మరో విధానం అందుబాటులోకి రానున్నది.
- ప్రపంచంలోనే మొట్టమొదటిది
- వ్యాసెక్టమీకి ప్రత్యామ్నాయం
- క్లినికల్ ట్రయల్స్ సక్సెస్
- సమర్థంగా పనిచేస్తున్నట్టు వెల్లడి
ICMR | న్యూఢిల్లీ, అక్టోబర్ 19: పిల్లలు పుట్టకుండా పురుషులకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న సంతాన నియంత్రణ విధానం వ్యాసెక్టమీకి ప్రత్యామ్నాయంగా మరో విధానం అందుబాటులోకి రానున్నది. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ (ఐసీఎంఆర్) ‘ఇంజెక్టబుల్ మేల్ కాంట్రాసెప్టివ్’ను తీసుకువస్తున్నది. ఈ ఇంజెక్షన్‌పై క్లినికల్ ట్రయల్స్ విజయవంతమయ్యాయి. ఢిల్లీ, ఉదంపూర్, లూధియానా, జైపూర్, ఖరగ్‌పూర్‌లోని దవాఖానల్లో ఈ ట్రయల్స్ నిర్వహించారు. 25-40 ఏండ్ల మధ్య వయసున్న 303 మందిపై నిర్వహించిన ఫేజ్3 ట్రయల్స్ ఫలితాలను ఇంటర్నేషనల్ ఓపెన్ యాక్సెస్ ఆండ్రాలజీ జర్నల్‌లో ప్రచురించారు. ఇంజెక్షన్ సమర్థంగా పనిచేస్తున్నదని, దుష్ప్రభావాలు కూడా పెద్దగా లేవని ట్రయల్స్‌లో తేలింది.
డీసీజీ అనుమతితో క్లినికల్ ట్రయల్స్…
పిల్లలు పుట్టకుండా పురుషుల్లో నిరోధించేందుకు వ్యాసెక్టమీ పద్ధతిని ఇప్పటివరకు వినియోగిస్తున్నారు. అయితే అందులోనూ కొన్ని ప్రతికూలతలు ఉన్నాయి. దీంతో కొత్త రకం చికిత్స అవసరం అయింది. ఐఐటీ-ఖరగ్‌పూర్‌కు చెందిన పరిశోధకుడు డాక్టర్ సుజోయ్ కె గుహ నేతృత్వంలో ప్రపంచంలో మొదటిసారిగా పురుషుల్లో శుక్రకణాల విడుదలను నిలువరించేందుకు రివర్సబుల్ ఇన్హిబిషన్ ఆఫ్ స్పెర్మ్ అండర్ గైడెన్స్ (ఆర్ఐఎస్యూజీ) ఇంజెక్షన్‌ను అభివృద్ధి చేశారు. డ్రగ్స్ కంట్రోలర్ ఆఫ్ జనరల్ ఇండియా (డీసీజీ) అనుమతితో ఫేజ్-3 ట్రయల్స్ నిర్వహించారు.
99.02 శాతం సమర్థత…
తాజాగా నిర్వహించిన క్లినికల్ ట్రయల్స్‌లో సానుకూల ఫలితాలు వచ్చినట్టు ఐసీఎంఆర్ తెలిపింది. ఆర్ఐఎస్యూజీ ఇంజెక్షన్ సక్సెస్‌పుల్‌గా పురుషుల్లో సంతాన నిరోధకంగా పని చేసినట్టు పేర్కొంది. అజూస్పెర్మియా (ఉద్వేగ సమయంలో స్రవించే ద్రవాల్లో శుక్రకణాలు లేకపోవడం)కు సంబంధించి ఆర్ఐఎస్యూజీ ఇంజెక్షన్ 97.3 శాతం సమర్థవంతంగా పని చేసినట్టు తెలిపింది. అదే సమయంలో 99.02 శాతం గర్భ రాకుండా నిరోధించినట్టు పరిశోధకులు గుర్తించారు. తీవ్రమైన దుష్ప్రభావాలు కూడా లేవని వారు తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కస్తాలలో సబ్ స్టేషన్ ముందు రైతుల నిరసన
విద్యుత్ వైరు తెగిపడి పాడి బర్రె మృతి
Crazy Kalyanam | ‘క్రేజీ కళ్యాణం’ రివ్యూ.. అనుపమ, తరుణ్ భాస్కర్ల సినిమా ఎలా ఉంది?
AP News | వైసీపీ మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు.. అధికారంలోకి రావడం ఖాయం, వడ్డీతో కలపి చెల్లిస్తాం
Share Market | లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్.. సెన్సెక్స్ 413 పాయింట్లు లాభం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

