Anna Hazare: పార్టీ సరైన మార్గంలో నడిస్తే.. ఎంపీలు పార్టీ వీడేవారు కాదు: అన్నాహజారే
Anna Hazare: ఆమ్ ఆద్మీ పార్టీ సరైన మార్గంలో పయనిస్తే, బహుశా రాఘవ్ చద్దాతో పాటు ఇతర ఎంపీలు ఆ పార్టీని వీడేవారు కాదు అని సామాజిక కార్యకర్త అన్నాహజారే అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి ఒక్కరికీ హక్కు ఉంటుందని, బహుశా ఆ ఎంపీలు ఏదైనా సమస్యను ఎదుర్కొని ఉంటారని, అందుకే వాళ్లు పార్టీ వీడినట్లు తెలుస్తోందన్నారు.
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన రాఘవ్ చద్దాతో పాటు మరో ఆరు మంది రాజ్యసభ ఎంపీలు ఆ పార్టీని వీడిన విషయం తెలిసిందే. ఆప్‌కు గుడ్‌బై చెప్పిన ఆ ఎంపీలు బీజేపీలో చేరారు. అయితే ఈ నేపథ్యంలో సామాజిక కార్యకర్త హన్నా హజారా (Anna Hazare) మాట్లాడారు. ఒకవేళ ఆమ్ ఆద్మీ పార్టీ సరైన మార్గంలో పయనిస్తే, బహుశా రాఘవ్ చద్దాతో పాటు ఇతర ఎంపీలు కూడా పార్టీని వీడేవారు కాదు అని అన్నాహజారే అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి ఒక్కరికీ హక్కు ఉంటుందని, బహుశా ఆ ఎంపీలు ఏదైనా సమస్యను ఎదుర్కొని ఉంటారని, అందుకే వాళ్లు పార్టీ వీడినట్లు తెలుస్తోందన్నారు. మహారాష్ట్రలోని అహల్యనగర్ జిల్లాలో రిపోర్టర్లతో అన్నాహజారే మాట్లారు.
అన్నాహజారేతో కలిసి ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యనేత కేజ్రీవాల్ అవినీతి ఉద్యమం సాగించిన విషయం తెలిసిందే. ఆప్ రాజ్యసభ ఎంపీలు రాఘవ్ చద్దా, సందీప్ పఠాక్.. ఢిల్లీలో శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించి.. ఆ పార్టీని వీడుతున్నట్లు వెల్లడించారు. ఆప్ రాజ్యసభ సభ్యుల్లో మూడో వంతు పార్టీని వీడుతున్నట్లు చద్దా తెలిపారు. ఆమ్ ఆద్మీ పార్టీలో నాయకత్వ లోపం తలెత్తిందని, ఒకవేళ ఆ పార్టీ కనుక సరైన మార్గంలో పయనిస్తే, బహుశా వాళ్లు పార్టీని వదిలి వెళ్లేవారు కాదని అన్నాహజారే అన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | కేటీఆర్‌ను కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. వీడియో
SBI Data Leak | ఎస్బీఐపై సైబర్ దాడి.. డాటా లీక్.. ఖాతాదారులు ఏం చేయాలంటే
Asian Para Games: స్ప్రింటర్ సిమ్రన్ శర్మకు రెండో గోల్డ్ మెడల్
Bike Accident | అతివేగంతో పోలీస్ వాహనాన్ని ఢీకొట్టిన బైక్.. వీడియో
విద్యపై దృష్టి పెట్టి ఉన్నత లక్ష్యాలను సాధించాలి : జైలర్ సంజీవరెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

