Anna Hazare | సొంత చర్యల వల్లే కేజ్రీవాల్ అరెస్ట్.. ఎక్కువ డబ్బు కోసమే మద్యం పాలసీ: అన్నా హజారే
Anna Hazare | సామాజిక ఉద్యమకారుడు, అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేసిన అన్నా హజారే (Anna Hazare) తన శిష్యుడు, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్‌పై స్పందించారు. సొంత చర్యల వల్లనే ఈ పరిస్థితి వచ్చిందన్నారు. మద్యం వద్దని కేజ్రీవాల్‌ను తాను చాలాసార్లు కోరినట్లు అన్నా హజారే తెలిపారు.
న్యూఢిల్లీ: సామాజిక ఉద్యమకారుడు, అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేసిన అన్నా హజారే (Anna Hazare) తన శిష్యుడు, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్‌పై స్పందించారు. సొంత చర్యల వల్లనే ఈ పరిస్థితి వచ్చిందన్నారు. మద్యం వద్దని కేజ్రీవాల్‌ను తాను చాలాసార్లు కోరినట్లు అన్నా హజారే తెలిపారు. అయితే ఎక్కువ డబ్బు కోసమే మద్యం పాలసీని ఆయన తీసుకువచ్చారని విమర్శించారు. అవినీతికి వ్యతిరేకంగా తాను చేపట్టిన ఉద్యమం నుంచి ఉద్భవించిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మద్యం పాలసీ చేసి ఉండకూడదని అభిప్రాయపడ్డారు. ‘నాతో కలిసి పనిచేసి, మద్యానికి వ్యతిరేకంగా గళం విప్పిన అరవింద్ కేజ్రీవాల్ లాంటి వ్యక్తి, మద్యం పాలసీని రూపొందించినందుకు నేను చాలా బాధపడ్డా. అయితే ఏం చేయగలం? ఏది జరిగినా చట్టం ప్రకారం జరుగాలి’ అని అన్నారు.
కాగా, 2011లో అవినీతికి వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద అన్నా హజారే భారీ ఉద్యమాన్ని చేపట్టారు. అరవింద్ కేజ్రీవాల్ కూడా ఆయనతో కలిసి పాల్గొన్నారు. ఈ ఉద్యమం తర్వాత రాజకీయ పార్టీగా ఆప్ అవతరించింది. అయితే అరవింద్ కేజ్రీవాల్‌కు ఆశీస్సులు ఇచ్చిన అన్నా హజారే ఆ పార్టీతోపాటు రాజకీయలకు దూరంగా ఉన్నారు. అలాగే ఆప్ తీరును పలుసార్లు ఆయన విమర్శించారు.
#WATCH | Ahmednagar, Maharashtra: On ED arresting Delhi CM Arvind Kejriwal, Social activist Anna Hazare says, "I am very upset that Arvind Kejriwal, who used to work with me, raise his voice against liquor, is now making liquor policies. His arrest is because of his own deeds…" pic.twitter.com/aqeJEeecfM
— ANI (@ANI) March 22, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Narayanpet | నారాయణపేటలో కొట్టుకున్న బీఎస్పీ- కాంగ్రెస్ నాయకులు
ప్రేమ వేధింపులకు యువతి బలి ?
Sukhbir Badal | బీజేపీతో పొత్తు ఉండొచ్చు.. ఆప్, కాంగ్రెస్‌లు ప్రత్యర్థులే.. శిరోమణి అకాళిదళ్ నేత సుఖ్బీర్ సింగ్
KTR | కేసీఆర్‌కు ఎప్పుడు ఓటు వేయాలా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు : కేటీఆర్
పేద విద్యార్థిని వైద్య విద్యకు ఆర్థిక చేయూత
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

