Anantnag Encounter | అనంత్‌నాగ్‌లో కొనసాగుతున్న సెర్చ్ ఆపరేషన్..! ఉగ్రవాదులు గెరిల్లా యుద్ధ వ్యూహాలు అవలంభిస్తున్నారనంటూ డీజీపీ..!
Anantnag Encounter | అనంత్‌నాగ్ కోకెర్నాగ్ అటవీ ప్రాంతంలోని రహస్యప్రాంతంలో నక్కిన ఉగ్రవాదుల కోసం బలగాలు సెర్చ్ ఆపరేషన్‌ను కొనసాగిస్తున్నాయని, పదికిపైగా బృందాలు మోహరించినట్లు జమ్మూకశ్మీర్ పోలీస్ డీజీపీ దిల్బాగ్ సింగ్ తెలిపారు.
Anantnag Encounter | అనంత్‌నాగ్ కోకెర్నాగ్ అటవీ ప్రాంతంలోని రహస్యప్రాంతంలో నక్కిన ఉగ్రవాదుల కోసం బలగాలు సెర్చ్ ఆపరేషన్‌ను కొనసాగిస్తున్నాయని, పదికిపైగా బృందాలు మోహరించినట్లు జమ్మూకశ్మీర్ పోలీస్ డీజీపీ దిల్బాగ్ సింగ్ తెలిపారు. అటవీ ప్రాంతం దట్టంగా ఉండడంతో కాస్త ఇబ్బంది ఎదురవుతుందని, రిస్క్ ఎక్కువగా ఉన్న చోట కొన్ని ఆపరేషన్లు ఉంటాయని, ఈ సమయంలో నష్టం జరిగే అవకాశాలుంటాయన్నారు. ధైర్యంతో బలగాలు ముందుకుసాగుతున్నాయన్నారు.
అయితే, ఇది వ్యూహాత్మక తప్పిదానికి సంబంధించిన విషయం కాదన్నారు. ఉగ్రవాదులు గెరిల్లా యుద్ధ వ్యూహాలను అవలంభిస్తూ పర్వతాలు, అడవులు, గుహలాంటి ప్రదేశాలను వినియోగించుకుంటూ భద్రతా బలగాలకు నష్టం కలిగిస్తున్నారన్నారు. ఇందుకోసం వ్యూహాన్ని సిద్ధం చేసుకోవాల్సి ఉందన్నారు. ఈ ఆపరేషన్‌కు నాయకత్వం వహించిన ధైర్యవంతులైన ఆఫీసర్స్‌కు సెల్యూట్ చేస్తున్నానన్నారు. ఆపరేషన్ నిర్వహిస్తున్న ప్రాంతంలో చాలా కఠినమైన ప్రాంతమన్నారు.
ఎత్తైన ప్రదేశం కావడంతో పాటు దట్టంగా అటవీ ఉందని, అందులో రహస్య స్థావరం ఉందన్నారు. ఉగ్రవాదులు అక్కడ దాక్కున్నారన్నారు. ప్రస్తుతం ఆపరేషన్ కొనసాగుతుందని వివరించారు. ఈ నెల 13న ఉగ్రవాదుల దాడిలో ఆర్మీ అధికారులతో పాటు పోలీస్ డీఎస్పీ మృతి చెందిన విషయం తెలిసిందే. ఆ తర్వాత జరిగిన సెర్చ్ ఆపరేషన్‌లో మరో సైనికుడు సైతం వీరమరణం పొందాడు. అప్పటి నుంచి ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు నిరంతరంగా తనిఖీలు కొనసాగుతున్నాయి. డ్రోన్లతో గ్రెనేడ్లతో దాడులు నిర్వహించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi: నా ఫోన్ ట్యాప్ చేశారు.. మోదీ చర్చకు రావాలి: రాహుల్ గాంధీ
Jangaa | త్రిగుణ్ ‘జంగా’ గ్లింప్స్ విడుదల.. రా అండ్ రస్టిక్ లుక్‌లో అదరగొట్టిన హీరో!
Gadari Kishore | బీర్ల ఐలయ్య బ్రోకర్ లెక్క మాట్లాడుతున్నడు : మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్
minister’s home attcked | మంత్రి ఇంటిపై దాడి.. ‘మేము చనిపోయాక వస్తారా?’ అంటూ పోలీసులపై ఆగ్రహం
Show cause notices | విధులకు గైర్హాజరైన హెచ్ఎం, ఆరుగురు ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

