పప్పులో కాలేసిన ఆనంద్ మహీంద్రా.. ట్విట్టర్లో ఆయన షేర్ చేసిన ఫోటోపై నెటిజన్లు ఏమన్నారో తెలుసా?
నెటిజన్లతో ఎప్పుడూ ఏదో ఒక విషయంపై సోషల్ మీడియాలో చర్చిస్తూనే ఉంటారు. కరెంట్ అఫైర్స్ మీద, ఫన్నీ జోక్స్, వీడియోలు, స్ఫూర్తినిచ్చే కథనాలు
ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్‌గా ఉంటారు. నెటిజన్లతో ఎప్పుడూ ఏదో ఒక విషయంపై సోషల్ మీడియాలో చర్చిస్తూనే ఉంటారు. కరెంట్ అఫైర్స్ మీద, ఫన్నీ జోక్స్, వీడియోలు, స్ఫూర్తినిచ్చే కథనాలు.. ఇలా అన్ని విషయాలపై ఆనంద్ ట్వీట్లు చేస్తుంటారు.
అయితే.. ఇటీవల ఆనంద్ మహీంద్రా పోస్ట్ చేసిన ఓ ఫోటోపై ప్రస్తుతం నెటిజన్లు ఎక్కువగా కామెంట్లు చేస్తున్నారు. దానికి కారణం.. అది ఫోటోషాప్ చేసిన ఫోటో కావడం. మండే మోటివేషన్ పేరుతో డ్రీమ్ బిగ్ అంటూ క్యాప్షన్ పెట్టి ఓ ఫోటోను షేర్ చేశారు ఆనంద్. ఆ ఫోటో ఒక టీ స్టాల్‌కు సంబంధించింది.
ఒబెరాయ్ హోటల్.. చాయ్ కాఫీ అంటూ బోర్డుపై రాసి ఉంటుంది. కింద మాత్రం ఒక నోట్ కనిపిస్తుంది. మాకు ఢిల్లీలో ఏ బ్రాంచ్‌లు లేవు.. అంటూ రాసి ఉంటుంది. నిజానికి.. ఒబెరాయ్ గ్రూప్ చాలా పెద్దది. ఫైవ్ స్టార్ హోటళ్లు కూడా వాళ్లకు ఉన్నాయి. ఈనేపథ్యంలో ఒబెరాయ్ పేరుతో హోటల్ పెట్టి.. మాకు ఏ బ్రాంచ్‌లు లేవు అంటూ చాలా ఇన్నేవేటివ్గా పెట్టిన ఆ టీ స్టాల్ ఫోటోను చూసి ఆనంద్ వెంటనే తన ట్విట్టర్లో షేర్ చేశారు.
Dream big….#MondayMotivation pic.twitter.com/rHKmq0Wynq
— anand mahindra (@anandmahindra) February 28, 2022
కానీ.. పరికించి చూస్తే ఆ ఫోటో పక్కా ఫోటోషాప్ చేసిన ఫోటోలా ఉంటుంది. దీంతో ఆ ఫోటోను చూసి.. అది ఫోటోషాప్ చేసిన ఫోటో సార్ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఆ టీ స్టాల్ ఢిల్లీలో లేదని.. నిజానికి ఆ టీ స్టాల్ ఉదయ్‌పూర్‌లో ఉందని.. దాని పేరు భైరునాథ్ టీ స్టాల్ అని నెటిజన్లు ఆనంద్‌కు ఆ ఫోటో ఎక్కడిదో వివరాలు చెప్పుకొచ్చారు.
Edited 😭😭😭😭😭 https://t.co/fr4rwfy5Af
— . (@single_soul1) February 28, 2022
Edited pic hai https://t.co/yRuQ1I3J14
— B. 🌈🌈 (@rancifoez) February 28, 2022
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

