Anand Mahindra | వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్ర నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు. సోషల్ మీడియా వేదికగా పలు ఆసక్తికర విషయాలు కూడా వెల్లడిస్తుంటారు. తాజాగా ఆనంద్ మహీంద్ర తనకు సంబంధించిన ఓ బ్లాక్ అండ్ వైట్ ఫొటోను షేర్ చేస్తూ.. ఆసక్తికర విషయాలను వెల్లడించారు. కాలేజీ రోజుల్లో మీ గోల్ ఏంటని ట్విట్టర్ వేదికగా ఓ వ్యక్తి ప్రశ్నించారు. దీనికి ఆనంద్ మహీంద్ర సమాధానమిస్తూ.. కాలేజీ రోజుల్లోని ఓ బ్లాక్ అండ్ వైట్ ఫొటోను ట్వీట్ చేశారు. ఆ ఫొటోలో ఆనంద్ మహీంద్ర చేతిలో ఓ కెమెరా ఉంది.
ఈ సమాధానం చెప్పండం అత్యంత సులభం. నేను ఓ ఫిల్మ్ మేకర్ కావాలని అనుకున్నాను. కాలేజీ చదువు కూడా ఈ సబ్జెక్టుకు సంబంధించినదే చదువుకున్నా. 1977 లో నా థీసిస్ (సిద్ధాంత వ్యాసం) కుంభమేళాకు సంబంధించిన ఓ సినిమా గురించే. కానీ.. ఈ ఫొటో ఇండోర్లో డాక్యుమెంటరీ ఫిల్మ్ తీస్తున్న సందర్భంలోనిదే.