Gas and Oil | అమెరికా నుంచి ఎల్పీజీ, రష్యా నుంచి ముడి చమురు.. ఇంధన భద్రతను పటిష్టం చేసుకుంటున్న భారత్
Gas and Oil | మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు, ప్రపంచవ్యాప్తంగా సరఫరా గొలుసులో ఆటంకాలు కొనసాగుతున్న నేపథ్యంలో భారత్ (India) తన ఇంధన భద్రతను పటిష్ఠం చేసుకునేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఇందులో భాగంగా అమెరికా (USA) నుంచి ద్రవీకృత పెట్రోలియం గ్యాస్ (LPG) ను, రష్యా (Russia) నుంచి ముడి చమురును తెప్పించుకుంది.
Gas and Oil : మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు, ప్రపంచవ్యాప్తంగా సరఫరా గొలుసులో ఆటంకాలు కొనసాగుతున్న నేపథ్యంలో భారత్ (India) తన ఇంధన భద్రతను పటిష్ఠం చేసుకునేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఇందులో భాగంగా అమెరికా (USA) నుంచి ద్రవీకృత పెట్రోలియం గ్యాస్ (LPG) ను, రష్యా (Russia) నుంచి ముడి చమురును తెప్పించుకుంది. ఆ రెండు దేశాలకు చెందిన భారీ నౌకలు మంగళూరు పోర్టుకు చేరుకున్నాయి.
అమెరికాలోని టెక్సాస్ నుంచి ఎల్పీజీతో బయలుదేరిన ‘పైక్సిస్ పయనీర్’ అనే కార్గో నౌక విజయవంతంగా మంగళూరు పోర్టులో లంగరేసింది. ఇదే సమయంలో రష్యా నుంచి ముడి చమురును తీసుకొచ్చిన మరో నౌకను కూడా పోర్టుకు 18 నాటికల్ మైళ్ల దూరంలో నిలిపి ఉంచారు. సింగిల్ పాయింట్ మూరింగ్ వ్యవస్థ ద్వారా ఈ చమురును పైప్లైన్లోకి, అక్కడి నుంచి మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్ లిమిటెడ్‌కు తరలించనున్నారు.
మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రపంచ ఇంధన ధరలను స్థిరీకరించే లక్ష్యంతో సముద్రంలో అప్పటికే ప్రయాణంలో ఉన్న రష్యా ముడి చమురు అమ్మకాలకు అమెరికా తాత్కాలికంగా అనుమతి ఇచ్చింది. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని భారత్ రష్యా నుంచి చమురు కొనుగోళ్లను గణనీయంగా పెంచింది. ఇరాన్ ప్రమేయంతో నెలకొన్న వివాదాలవల్ల సరఫరాలో ఆటంకాలు ఏర్పడటంతో భారత్ ఈ చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఇదే క్రమంలో ఈ వారం గుజరాత్‌లోని వాడినార్, ముంద్రా పోర్టులకు ‘నందా దేవి’, ‘శివాలిక్’ అనే రెండు భారత ఎల్పీజీ ట్యాంకర్లు కూడా సురక్షితంగా చేరుకున్నాయి. ప్రమాదకరమైన హర్మూజ్ జలసంధి గుండా ఇవి రావడం గమనార్హం. ప్రస్తుతం పశ్చిమ పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో 611 మంది భారత నావికులతో కూడిన 22 భారత నౌకలు ఉన్నాయని, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తోందని అధికారులు చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Koppula Eshwar | కరువు మండలాల రైతులకు ఆర్థిక సహాయం విడుదల చేయాలి : మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
IL-76MD | ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అరుదైన రికార్డు.. 13,629 అడుగుల ఎత్తులో IL-76MD ఫ్లైట్ ల్యాండింగ్
ప్రభుత్వ ధాన్యానికి ఎగనామం.. రూ.12 కోట్ల సీఎంఆర్ బియ్యం గల్లంతు
VC Aldas Janaiah | వీసీ అల్డాస్ జానయ్య ట్రాన్స్ఫర్ చేస్తా అని బెదిరించారు.. వేధింపులపై మహిళా ప్రొఫెసర్.. వీడియో
BRS Leaders | ప్రజా ఉద్యమాలను కేసులతో ఆపలేరు : బీఆర్ఎస్ నాయకులు
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?

