Amritpaal Singh: అమృత్‌పాల్ డిమాండ్లకు తలొగ్గిన పంజాబ్ ప్రభుత్వం.. లవ్‌ప్రీత్ విడుదల
Amritpal Singh | పంజాబ్‌లో శాంతి భద్రతలు అదుపు తప్పకూడదన్న ఉద్దేశంతోనే అమృత్‌పాల్ సింగ్ అనుచరుడు లవ్‌ప్రీత్ తుఫాన్‌ను విడుదల చేసినట్లు పోలీస్ అధికారి తెలిపారు. కోర్టు అనుమతితో అతడ్ని జైలు నుంచి రిలీజ్ చేసినట్లు చేసినట్లు చెప్పారు. అయితే ఖలిస్థానీ బోధకుడు అమృత్‌పాల్ సింగ్ బెదిరింపులకు భయపడిన పోలీసులు అతడి అనుచరుడు లవ్ప్రీత్ను విడుదల చేయడంపై విమర్శలు వెల్లువెత్తాయి.
అమృత్సర్: వివాదాస్పద మత గురువు, ‘వారిస్ పంజాబ్ దే’ ఖలీస్థానీ నేత అమృత్‌పాల్ సింగ్ (Amritpaal Singh) డిమాండ్లకు పంజాబ్ ప్రభుత్వం తలొగ్గింది. అరెస్ట్ చేసిన ఆయన అనుచరుడు లవ్‌ప్రీత్ తుఫాన్‌ను పోలీసులు శుక్రవారం విడుదల చేశారు. కాగా, తన అనుచరుడి విడుదల కోసం అమృత్‌పాల్ సింగ్ ఏకంగా యుద్ధ వాతావరణం వంటి పరిస్థితిని సృష్టించాడు. లవ్‌ప్రీత్‌పై నమోదైన కేసును రద్దు చేయాని, ఆయనను విడుదల చేయాలని గురువారం డిమాండ్ చేశాడు. లేనిపక్షంలో జరిగే పరిణామాలకు ప్రభుత్వం, పోలీసులు బాధ్యత వహించాలని హెచ్చరించాడు.
ఈ నేపథ్యంలో కత్తులు, తుపాకులు వంటి ఆయుధాలు చేతపట్టిన అమృత్‌పాల్ మద్దతు దారులు రెచ్చిపోయారు. వందల సంఖ్యలో అమృత్‌సర్‌లోని అజ్నాలా పోలీసు స్టేషన్ వద్దకు చేరుకున్నారు. అడ్డుగా ఉంచిన బారికేడ్లను తొలగించి పోలీసులతో ఘర్షణకు దిగారు. ఈ దాడిలో ముగ్గురు పోలీసులు గాయపడ్డారు. దీంతో గురువారం నుంచి ఆ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొన్నది. ఈ నేపథ్యంలో లవ్‌ప్రీత్ తుఫాన్‌ను విడుదల చేస్తామని పోలీసులు హామీ ఇచ్చారు. ఆ మేరకు శుక్రవారం అతడ్ని విడుదల చేశారు.
కాగా, పంజాబ్‌లో శాంతి భద్రతలు అదుపు తప్పకూడదన్న ఉద్దేశంతోనే అమృత్‌పాల్ సింగ్ అనుచరుడు లవ్‌ప్రీత్ తుఫాన్‌ను విడుదల చేసినట్లు పోలీస్ అధికారి తెలిపారు. కోర్టు అనుమతితో అతడ్ని జైలు నుంచి రిలీజ్ చేసినట్లు చెప్పారు. అయితే ఖలిస్థానీ బోధకుడు అమృత్‌పాల్ సింగ్ బెదిరింపులకు భయపడిన పోలీసులు అతడి అనుచరుడు లవ్ప్రీత్ను విడుదల చేయడంపై విమర్శలు వెల్లువెత్తాయి. పంజాబ్‌లోని రాడికల్స్ పట్ల అధికారంలో ఉన్న ఆప్ ప్రభుత్వం, పోలీసులు ఉదారతతో వ్యవహిస్తున్నారని కొందరు ఆరోపించారు.
Amritpaal Singh: ఎవరీ అమృత్‌పాల్ సింగ్.. అమృత్సర్ అటాక్‌తో లింకేంటి?
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

