Maha Kumbh Mela | ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఫిబ్రవరి 4 వరకు కుంభమేళాకు బస్సులు రద్దు
Maha Kumbh Mela | ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. మహా కుంభమేళా కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సు సర్వీసులను ఫిబ్రవరి 4 వరకు రద్దు చేసింది. అనివార్య పరిస్థితుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఒక ఉత్తర్వులో పేర్కొంది.
భువనేశ్వర్: ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. మహా కుంభమేళా (Maha Kumbh Mela) కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సు సర్వీసులను ఫిబ్రవరి 4 వరకు రద్దు చేసింది. అనివార్య పరిస్థితుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఒక ఉత్తర్వులో పేర్కొంది. మహా కుంభమేళా, అయోధ్యకు వెళ్లే ప్రయాణికుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సు సర్వీసులను ఫిబ్రవరి 4 వరకు తక్షణమే రద్దు చేస్తున్నట్లు ఒడిశా ఆర్టీసీ తెలిపింది. తాజా అప్డేట్ను అధికారిక వెబ్సైట్, సోషల్ మీడియాలో సమాచారం ఇస్తామని పేర్కొంది. ఈ మేరకు గురువారం ఒక నోటీస్‌ను జారీ చేసింది. అయితే ఫిబ్రవరి 26 వరకు మహా కుంభమేళాకు ప్రత్యేక బస్సు సర్వీసులు నిర్వహించాలని గతంలో నిర్ణయించింది.
కాగా, ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. అయితే మౌని అమావాస్య సందర్భంగా త్రివేణి సంగమం వద్ద తోపులాట జరిగింది. ఈ సంఘటనలో 30 మంది భక్తులు మరణించారు. 60 మందికిపైగా గాయపడ్డారు. పలువురి జాడ కనిపించడంలేదు. అలాగే అగ్నిప్రమాదాలు వంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒడిశా ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆ రాష్ట్రం నుంచి భక్తుల రద్దీని తగ్గించేందుకు మహా కుంభమేళాకు ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సు సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

