Indo-Pak Tensions | భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో.. ఆరోగ్య మౌలిక సదుపాయాలపై జేపీ నడ్డా సమీక్ష
Indo-Pak Tensions | భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి. సరిహద్దుల్లో సైనిక దాడులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా ఆ శాఖ సీనియర్ అధికారులతో శుక్రవారం సమావేశమయ్యారు.
న్యూఢిల్లీ: భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి. (Indo-Pak Tensions) సరిహద్దుల్లో సైనిక దాడులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా ఆ శాఖ సీనియర్ అధికారులతో శుక్రవారం సమావేశమయ్యారు. దేశంలోని ఆసుపత్రుల్లో ఆరోగ్య మౌలిక సదుపాయాల సంసిద్ధతను ఆయన సమీక్షించారు. దేశవ్యాప్తంగా హాస్పిటల్స్, ఆరోగ్య సౌకర్యాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు ఆరోగ్య శాఖ అధికారులు కేంద్ర మంత్రి జేపీ నడ్డాకు వివరించారు.
కాగా, ఏప్రిల్ 22న జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్లో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో పర్యాటకులతో సహా 26 మంది మరణించారు. దీనికి ప్రతీకారంగా ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో సైనిక దాడులను భారత్ చేపట్టింది. పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లోని 9 కీలక ఉగ్రవాద స్థావరాలు, శిక్షణ కేంద్రాలను ధ్వంసం చేసింది. సైనిక దాడుల్లో సుమారు వంద మంది ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ నేపథ్యంలో సరిహద్దుల్లో పాక్ పాల్పడుతున్న దాడులను భారత్ తిప్పికొడుతున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

