Canada Diplomatic Row | ప్రధానిని కలిసిన విదేశాంగ మంత్రి జైశంకర్.. కెనడాతో నెలకొన్న దౌత్య విభేదాలపై వివరణ
Canada Diplomatic Row | కెనడాతో దౌత్యపరమైన విభేదాల (Canada Diplomatic Row) నేపథ్యంలో ప్రధాని మోదీని కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ బుధవారం కలిశారు. కొత్త పార్లమెంట్ భవనంలో వారిద్దరూ సమావేశమయ్యారు.
న్యూఢిల్లీ: కెనడాతో దౌత్యపరమైన విభేదాల (Canada Diplomatic Row) నేపథ్యంలో ప్రధాని మోదీని కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ బుధవారం కలిశారు. కొత్త పార్లమెంట్ భవనంలో వారిద్దరూ సమావేశమయ్యారు. కెనడాతో నెలకొన్న దౌత్యపరమైన సమస్యలను ప్రధాని మోదీకి విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ వివరించినట్లు తెలిసింది. జూన్‌లో కెనడా భూభాగంలో జరిగిన ఖలిస్థాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్యకు భారత ప్రభుత్వంతో సంబంధం ఉందని ఆ దేశం ఆరోపించింది.
కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో సోమవారం హౌస్ ఆఫ్ కామన్స్‌లో ఈ అంశంపై మాట్లాడారు. ఖలిస్థాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్యకు భారత ప్రభుత్వ ఏజెంట్లతో సంబంధం ఉందన్న దానికి నమ్మదగిన ఆధారాలు ఉన్నాయని తెలిపారు. ఈ సంఘటనపై రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతుండటంపైనా మంగళవారం ఆయన స్పందించారు. భారత్‌ను రెచ్చగొట్టడం లేదన్నారు. అయితే నిజ్జర్ హత్యను అత్యంత తీవ్రంగా పరిగణించాలని భారత ప్రభుత్వాన్ని కోరారు.
మరోవైపు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో వ్యాఖ్యల నేపథ్యంలో ఇరు దేశాలు తమ తమ దౌత్య అధికారులను బహిష్కరించాయి. అలాగే కెనడా ఆరోపణలను భారత్ ఖండించింది. ఇవి కల్పితం, విడ్డూరమని విమర్శించింది. ఈ నేపథ్యంలో భారత్, కెనడా సంబంధాలపై చర్చించేందుకు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ప్రధాని మోదీని కొత్త పార్లమెంట్ హౌస్‌లో బుధవారం కలిశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్న ‘రణబాలి’.. 24 గంటల్లోనే 1.39 లక్షల టికెట్ల విక్రయం!
Cricketer Jehangir | అభిమానిని కిందపడేసి చితకబాదిన క్రికెటర్.. వీడియో వైరల్!
MBBS Student | హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని.. మెడికల్ విద్యార్థిని ఆత్మహత్య
Jailer 2 | రజినీకాంత్ ‘జైలర్ 2’ సునామీ.. 5 రోజుల్లోనే రూ. 500 కోట్ల వసూళ్లు!
Dasara Posters | టాలీవుడ్లో పండగ జోష్.. దసరా కానుకగా సందడి చేసిన కొత్త సినిమాల పోస్టర్లు చూశారా!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

