Amazon CEO: అమెజాన్‌లో 27 వేల మంది తొలగింపు.. దానిపై సీఈవో ఆండీ జాసీ ఏమన్నారంటే
Amazon CEO: 27 వేల మందిని తొలగించిన ప్లాన్ గురించి అమెజాన్ సీఈవో ఆండీ జాసీ ఓ లేఖ రిలీజ్ చేశారు. షేర్హోల్డర్లకు ఆయన లేఖ రాస్తూ.. దాంట్లో కంపెనీ తీసుకున్న నిర్ణయాలను చెప్పారు. అతికష్టంగానే ఉద్యోగుల తొలగింపు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
న్యూఢిల్లీ: ఇటీవల అమెజాన్(Amazon) సంస్థ 27వేల మందిని తొలగించేందుకు నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా రిలీజ్ చేసిన లేఖలో ఆ సంస్థ సీఈవో ఆండీ జాసీ(CO Andy Jassy) కొన్ని విషయాలు తెలిపారు. కాస్ట్ కట్టింగ్‌లో భాగంగా, సంస్థ అభివృద్ధి కోసం ఈ కఠిన నిర్ణయాన్ని తీసుకున్నట్లు ఆయన చెప్పారు. గత నెల నుంచి అమెజాన్ సంస్థలో సెకండ్ లేఆఫ్ మొదలైంది. రెండో దఫాలో సుమారు 9 వేల మందిని తొలగించారు. ఈ నేపథ్యంలో ఆయన షేర్హోల్డర్లకు లేఖ రాశారు. తొలి ఫేజ్‌లో 18 వేల జాబ్స్‌ను తొలగించిన విషయం తెలిసిందే.
ఇటీవల ఉద్యోగులకు రాసి లేఖలో సంస్థ నిర్ణయాన్ని స్వాగతించారు. దీర్ఘకాలం ఆలోచనతో కంపెనీ సంక్షేమం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. కంపెనీ గురించి లోతుగా ఆలోచించామని, ఒక్కొక్క బిజినెస్‌ను స్టడీ చేశామని, లాంగ్ టర్మ్‌లో రెవన్యూ జరేట్ చేస్తుందా లేదా అన్న ఆలోచనలతో నిర్ణయాన్ని తీసుకున్నామన్నారు. రానున్న రోజుల్లో కంపెనీకి మంచి జరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఖర్చులను తగ్గించేందుకు అమెజాన్ కంపెనీకి చెందిన ఫిజకల్ స్టోర్స్‌ను మూసివేశామన్నారు. అమెజాన్ ఫ్యాబ్రిక్, అమెజాన్ కేర్ ఎఫర్ట్స్‌ను కూడా మూసివేసినట్లు చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కృష్ణసాగర్‌లో కేంద్ర ప్రభుత్వ ఆర్థిక పథకాలపై అవగాహన
Army van overturns | అల్లవాడ గేట్ సమీపంలో ఆర్మీ వ్యాన్ బోల్తా..ఎనిమిది మంది జవాన్లకు తీవ్రగాయాలు
Rahul Gandhi: నా ఫోన్ ట్యాప్ చేశారు.. మోదీ చర్చకు రావాలి: రాహుల్ గాంధీ
Jangaa | త్రిగుణ్ ‘జంగా’ గ్లింప్స్ విడుదల.. రా అండ్ రస్టిక్ లుక్‌లో అదరగొట్టిన హీరో!
Gadari Kishore | బీర్ల ఐలయ్య బ్రోకర్ లెక్క మాట్లాడుతున్నడు : మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

