అమర్త్యసేన్ క్షేమంగా ఉన్నారు
ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్యసేన్ మృతి చెందినట్టు వస్తున్న వార్తలను ఆయన కుటుంబ సభ్యులు మంగళవారం తీవ్రంగా ఖండించారు. ‘ఇది నకిలీ వార్త. ఇటీవలే కేంబ్రిడ్జిలోని మా ఇంటిలో ఆయనతో వారం రోజులు ఉండి వచ్చా. ఆయన పూర్తి ఆరోగ్యంతో నిక్షేపంగా ఉన్నారు.
- మరణ వార్తలను ఖండించిన కుమార్తె
కోల్కతా, అక్టోబర్ 10: ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్యసేన్ మృతి చెందినట్టు వస్తున్న వార్తలను ఆయన కుటుంబ సభ్యులు మంగళవారం తీవ్రంగా ఖండించారు. ‘ఇది నకిలీ వార్త. ఇటీవలే కేంబ్రిడ్జిలోని మా ఇంటిలో ఆయనతో వారం రోజులు ఉండి వచ్చా. ఆయన పూర్తి ఆరోగ్యంతో నిక్షేపంగా ఉన్నారు. వారానికి రెండు కోర్సులు బోధిస్తున్నారు’ అని ఆయన కుమార్తె దేవ్ సేన్ పీటీఐకి తెలిపారు. కాగా, అమర్త్యసేన్ మృతి చెందారని పలువురు ఎక్స్లో పోస్టు చేస్తూ ఆయన మృతికి సంతాపం కూడా తెలియజేస్తున్నారు. అయితే ఆయన మరణ వార్తలను ఆయన కుమార్తె దేవ్ సేన్ ఖండిస్తూ, ఆయనకేమీ కాలేదని, దయచేసి నిర్ధారించకుండా ఇలాంటివి ప్రచారం చేయవద్దంటూ కోరారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

