అజిత్ ధోవల్‌ను కలిసిన కెప్టెన్ అమరీందర్ సింగ్

న్యూఢిల్లీ: పంజాబ్‌లో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారిన విషయం తెలిసిందే. అయితే ఢిల్లీ టూర్లో ఉన్న ఆ రాష్ట్ర మాజీ సీఎం అమరీందర్ సింగ్ ఇవాళ నేషనల్ సెక్యూర్టీ అడ్వైజర్ అజిత్ దోవల్‌తో భేటీ అయ్యారు. బుధవారం రోజున కేంద్ర మంత్రి అమిత్ షాతోనూ అమరీందర్ భేటీ అయ్యారు. దీంతో ఆయన బీజేపీలో చేరే అవకాశాలు ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. నూతన రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతుల గురించి కేంద్రానికి ఫిర్యాదు చేసేందుకు షాతో భేటీ అయినట్లు అమరీందర్ తన ట్వీట్లో వెల్లడించారు. మరో వైపు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు అంబికా సోనీ, కమల్‌నాథ్‌లు.. కెప్టెన్ అమరీందర్‌ను కలిసేందుకు ప్రయత్నిస్తున్నారు.
పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికలు మరో 4 నెలల్లో జరగనున్నాయి. ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీని అమరీందర్ వీడితే, ఆ పార్టీకి పంజాబ్‌లో కష్టాలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈనేపథ్యంలో కెప్టెన్ అమరీందర్‌ను బుజ్జగించేందుకు కాంగ్రెస్ సీనియర్ నేతలు ప్రయత్నిస్తున్నారు. కానీ అమరీందర్ మాత్రం ఢిల్లీలో బీజేపీ పెద్దల్ని కలవడం కొంత టెన్షన్ పుట్టిస్తోంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Puducherry | పుదుచ్చేరి సముద్రంలో తెలంగాణ విద్యార్థులు.. తృటిలో తప్పిన పెను ప్రమాదం!
Deeksha Divas | ఆస్ట్రేలియాలో దీక్షా దివస్.. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలు
Sukumar | సుకుమార్‌తో అల్లు అరవింద్ కోటి రూపాయల పందెం.. ‘ఆకాశంలో ఒక తార’ చూసి కన్నీళ్లు పెట్టుకున్న పుష్ప డైరెక్టర్!
Deeksha Divas | కేసీఆర్ దీక్షాబలం.. అమరుల త్యాగఫలం.. నేటి తెలంగాణ: హరీశ్‌రావు
KCR | తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో’.. ఆ దీక్ష దేశ రాజకీయాలనే మలుపు తిప్పింది: కేటీఆర్
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

