2029 వరకూ మోదీనే!
2029 వరకూ మోదీనే ప్రధానిగా కొనసాగుతారని, ఆ తర్వాత కూడా తమను ఆయనే నడిపిస్తారని కేంద్రహోంమంత్రి అమిత్ షా పునరుద్ఘాటించారు.
- ఆ తర్వాత కూడా ఆయనే
- అమిత్ షా పునరుద్ఘాటన
- ‘75 ఏండ్ల’ రిటైర్మెంట్ రూల్ మోదీకి వర్తించదా? అని అరవింద్ కేజ్రీవాల్ ప్రశ్న
- మోదీ వారసుడిపై ది ఎకానమిస్ట్లోనూ కథనం
- దీంతో బీజేపీ వర్గాల్లో పెద్దయెత్తున చర్చ
- ఈ క్రమంలోనే షా వివరణ
(స్పెషల్ టాస్క్ బ్యూరో)
హైదరాబాద్, మే 15 (నమస్తే తెలంగాణ): 2029 వరకూ మోదీనే ప్రధానిగా కొనసాగుతారని, ఆ తర్వాత కూడా తమను ఆయనే నడిపిస్తారని కేంద్రహోంమంత్రి అమిత్ షా పునరుద్ఘాటించారు. ‘75 ఏండ్ల రిటైర్మెంట్ నిబంధన మోదీకి వర్తించదా?’ అంటూ ఆప్ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్ ఇటీవల ప్రశ్నించారు. మోదీ తర్వాత ఆయన వారసుడు ఎవరంటూ బ్రిటిష్ పత్రిక ‘ది ఎకానమిస్ట్’లోనూ ఓ కథనం ప్రచురితమైంది. దీంతో మోదీనే తమ ప్రధాని అని, 2029 తర్వాత కూడా ఆయనే తమను నడిపిస్తారంటూ అమిత్ షా వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.
ప్రధానిగా నేనే ఉంటా..
75 ఏండ్లుపైబడిన వారిని రాజకీయాలకు దూరం చేయడమన్న నిబంధన బీజేపీలో అనధికారికంగా కొనసాగుతున్నది. బీజేపీ సీనియర్లు ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి, సుమిత్రా మహాజన్, యశ్వంత్ సిన్హాను వయసు ప్రాతిపదికన బలవంతంగా పక్కనపెట్టారు. త్వరలో మోదీకి 75 ఏండ్లు నిండబోతున్నాయి. దీంతో ఆయన కూడా రిటైర్మెంట్ తీసుకొంటారా? అంటూ విపక్ష పార్టీ నేతలతో పాటు అంతర్జాతీయ మీడియాలోనూ పెద్దయెత్తున కథనాలు వస్తున్నాయి. ఇదే విషయమై మోదీ ఇటీవల మాట్లాడుతూ.. 2029 వరకూ బీజేపీ నుంచి తానే ప్రధానిగా కొనసాగుతానని పరోక్షంగా హింట్ ఇచ్చారు. కాగా, మోదీ వారసుడిపై ‘ది ఎకానమిస్ట్’లో ప్రచురితమైన కథనం బీజేపీలోని మోదీ వ్యతిరేకవర్గం పనేనన్న వార్తలు వినిపిస్తున్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
Breast Cancer | మహిళలు రోజూ వ్యాయామం చేస్తే రొమ్ము క్యాన్సర్ ముప్పు తగ్గుతుందా?
IND vs NZ T20I | నేడు న్యూజిలాండ్‌తో రెండో టీ20.. తుదిజట్టులోకి వైభవ్ సూర్యవంశీ..!
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

