Baba Ramdev | హరిద్వార్, మార్చి 20: అల్లోపతి వైద్య విధానంపై యోగా గురు రాందేవ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అల్లోపతి (ఇంగ్లిష్) వైద్య విధానంలో క్యాన్సర్, మధుమేహం, అధిక రక్తపోటు లాంటి మొండి వ్యాధులు నయం కావని, అదే ఆయర్వేదంలో అయితే మూలాల నుంచి ఆ రోగాలను నిర్మూలించవచ్చని ఆయన అన్నారు.
ఉత్తరాఖండ్ ఆయుర్వేద యూనివర్సిటీ, దీనదయాళ్ కామధేను గోశాల సమితి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ ఆయుర్వేద సదస్సులో ఆయన మాట్లాడారు. ఆవు పాలలో ఎన్నో ఔషధ గుణాలున్నాయని, వాటి ద్వారా శరీరంలోని రోగ నిరోధక శక్తి పెరుగుతుందని చెప్పారు.