గుమ్లా : జార్ఖండ్‌లోని గుమ్లా జిల్లాలో మానవత్వాన్ని మంటగలిపే ఉదంతం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం పల్మా గ్రామంలో సునీల్ లోహ్రా అనే వ్యక్తి మూడేండ్ల చిన్నారిపై లైంగిక దాడి చేశాడు. విషయం తెలుసుకున్న పంచాయితీ పెద్దలు పోలీసులకు తెలియజేయడానికి బదులు బాధితురాలిని బెదిరించారు. నిందితునికి రూ.లక్ష జరిమానా విధించారు.
నిందితుడు రూ. 20 వేలు చెల్లించి, మిగిలింది వారంలో చెల్లిస్తానన్నాడు. దీంతో ఆ రూ.20 వేలతో పంచాయి తీ పెద్దలు మద్యం పార్టీ చేసుకున్నా రు. ఓ గ్రామస్తుడి సమాచారంతో పో లీసులు మందు పార్టీలో ఉన్న నిందితుడిని అరెస్ట్ చేశారు. జరిగిన ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.