శ్రీలంక పరిస్థితులపై కేంద్రం అఖిలపక్ష సమావేశం
న్యూఢిల్లీ : గత ఏడు దశాబ్దాల్లో ఎన్నడూ లేని విధంగా శ్రీలంక ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. ఆ దేశంలో పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వం మంగళవారం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. కేంద్రం తరఫున విదేశాంగ మంత్రి జై ఎస్ జైశంకర్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి పాల్గొనగా.. వివిధ రాజకీయ పక్షాలకు చెందిన నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా జైశంకర్ మాట్లాడుతూ శ్రీలంకలో పరిస్థితులు విషమంగా ఉన్నాయని, దీనిపై భారత్ ఆందోళన చెందుతోందన్నారు.
సంక్షోభం సహజంగానే భారత్‌ను కలవరపెడుతుందన్నారు. అయితే, పొరుగుదేశంలో ఉన్న పరిస్థితులు భారత్‌లో తలెత్తే అవకాశాలు లేవన్నారు. ఈ విషయంలో కొంత తప్పుడు సమాచారంతో కూడిన పోలికలు కనిపిస్తున్నాయన్నారు. భారత్‌లో అలాంటి పరిస్థితి ఏర్పడుతుందా? అని కొందరు తనను అడిగారన్నారు. సమావేశంలో కాంగ్రెస్ నేతలు పి చిదంబరం, మాణికం ఠాగూర్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నేత శరద్ పవార్, ద్రవిడ మున్నేట్ర కజగం నేత చెందిన టీఆర్ బాలు, ఎంఎం అబ్దుల్లా, ఎం తంబిదురై (అఖిల భారత అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం) హాజరయ్యారు.
సౌగత రాయ్ (తృణమూల్ కాంగ్రెస్), ఫరూక్ అబ్దుల్లా (నేషనల్ కాన్ఫరెన్స్), సంజయ్ సింగ్ (ఆమ్ ఆద్మీ పార్టీ), కేశవరావు (టీఆర్ఎస్) రితేష్ పాండే (బహుజన్ సమాజ్ పార్టీ), విజయసాయి రెడ్డి (వైఎస్ఆర్ కాంగ్రెస్) తదితరులు హాజరయ్యారు. గత కొద్ది రోజులుగా విదేశీ మారకద్రవ్యం అడుగంటడంతో శ్రీలంక తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు. ఆహారం, ఇంధనం, ఔషధాలతో సహా నిత్యావసర వస్తువుల దిగుమతికి ఆటంకం కలుగుతున్నది. సంక్షోభం మధ్య ప్రజల తిరుగుబాటు నేపథ్యంలో తాత్కాలిక రణిల్ విక్రమసింఘే దేశంలో అత్యవస పరిస్థితి ప్రకటించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sonia Gandhi | ఎమెర్జెన్సీ విధించడం పొరపాటు నిర్ణయం.. ఆత్మకథలో పేర్కొన్న సోనియా
Supreme Court | ఓబీసీల పాత నియామకాలు, పదోన్నతులు కొనసాగించొచ్చు : సుప్రీంకోర్టు
Free Laptops | కాలేజీ విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు.. రూ.2 వేల కోట్లు కేటాయించిన తమిళనాడు ప్రభుత్వం
INDvNZ | భళారే బ్రార్.. న్యూజిలాండ్‌తో రెండో వన్డేలో గట్టెక్కిన భారత్
Aldas Janaiah | నీతో ఏకాంతంగా గడుపాలి..! అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు అగ్రికల్చర్ వర్సిటీ వీసీ అల్దాస్ జానయ్య లైంగిక వేధింపులు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

