జార్ఖండ్‌లో గ్రహాంతరవాసి!

ప్రచారం
రాత్రివేళ హైవేపై ఓ వింత ఆకారం నడిచి వెళ్తున్న 30 సెకండ్ల వీడియో వైరల్ అయింది. అది గ్రహాంతరవాసి అని, దయ్యమని ప్రచారం హోరెత్తింది. ఆ దృశ్యాన్ని జార్ఖండ్‌లోని హజారీబాగ్‌లో గుర్తించి వీడియో తీశారని కథనం. కొందరైతే సామాజిక మాధ్యమాల్లో దీనిని షేర్ చేస్తూ ఇస్రో, నాసాలనూ ట్యాగ్ చేశారు. నిర్మాత ఏక్తా కపూర్ ఇన్‌స్టాలో వీడియోను షేర్ చేశారు.
వాస్తవం
ఈ వీడియోను తీసిన ఇద్దరు యువకులను స్థానిక చానల్ ‘జన్ దూత్’ ఇంటర్వ్యూ చేసింది. జార్ఖండ్‌లోని చక్రధరపూర్ నుంచి సరాయీకేలా వస్తుండగా ఈ దృశ్యం కంటపడిందని వారు తెలిపారు. ఆ వింత ఆకారాన్ని చూసి భయపడ్డామని, మంత్రగత్తె అని భావించామన్నారు. అయితే వీడియోలో కనిపిస్తున్నది వివస్త్రగా ఉన్న మహిళని చెప్పారు. వాట్సాప్ స్టేటస్‌గా పెట్టడంతో వైరల్ అయిందని చెప్పారు. ఆ మహిళ ఎవరు, దుస్తులు లేకుండా ఎందుకు తిరుగుతున్నదో ఇంకా తెలియదు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
Karimnagar | ధ్రువీకరణ పత్రం అందేదెలా?.. కరీంనగర్ నగరపాలక సంస్థ నిర్లక్ష్యంతో విలీన గ్రామాల వారికి తిప్పలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

