యూపీ పోరు : సైకిల్ యాత్ర చేపట్టిన అఖిలేష్ యాదవ్

లక్నో : వచ్చే ఏడాది ఆరంభంలో జరిగే యూపీ అసెంబ్లీ ఎన్నికలకు సమాజ్‌వాదీ పార్టీ సంసిద్ధమైంది. ధరల పెరుగుదల, నిరుద్యోగం, వ్యవసాయ చట్టాలు, నేరాల పెరుగుదలపై నిరసనగాఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ గురువారం లక్నోలో సైకిల్ యాత్ర నిర్వహించారు. సోషలిస్ట్ నేత జనేశ్వర్ మిశ్రా జయంతోత్సవాల సందర్భంగా తాలూకా స్ధాయిలో సైకిల్ యాత్రలను ఎస్పీ శ్రేణులు నిర్వహించాయి. అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ క్యాడర్‌ను సంసిద్ధం చేసేందుకే ఈ యాత్రలను చేపట్టినట్టు రాజకీయ పరిశీలకులు పేర్కొన్నారు.
కాగా సైకిల్ యాత్రకు ముందు అఖిలేష్ యాదవ్ విలేకరులతో మాట్లాడుతూ యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ 400 స్ధానాలు గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఇక యూపీ పోరులో ప్రధాన పార్టీలతో పొత్తు ఉండదని చిన్న పార్టీలతో అవగాహనతో ముందుకెళతామని అఖిలేష్ ఇప్పటికే స్పష్టం చేశారు. మరోవైపు ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ ఎస్పీ నేత ములాయం సింగ్ యాదవ్‌తో ఇటీవల భేటీ కావడంతో ఇరు పార్టీల మధ్య పొత్తుపైనా ఊహాగానాలు సాగుతున్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

