accident : బస్సు ఢీకొని ఎయిర్‌లైన్స్ ఉద్యోగి మృతి.. మరొకరికి తీవ్రగాయాలు
accident : బిహార్ రాజధాని పట్నా జయప్రకాష్ నారాయణ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘోర ప్రమాదం జరిగింది. ఎలక్ట్రిక్ బస్సు అదుపుతప్పి ఇద్దరు ఎయిర్‌లైన్స్ ఉద్యోగులను ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందగా.. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి.

పట్నా : బిహార్ రాజధాని పట్నా జయప్రకాష్ నారాయణ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘోర ప్రమాదం జరిగింది. ఎలక్ట్రిక్ బస్సు అదుపుతప్పి ఇద్దరు ఎయిర్‌లైన్స్ ఉద్యోగులను ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందగా.. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. మృతి చెందిన వ్యక్తిని ఇండిగో ఎయిర్ లైన్స్ ఉద్యోగి ప్రిన్స్ రాజ్‌గా గుర్తించారు. ప్రిన్స్రాజ్ది ఇవాళ జన్మదినం కావడం.. ఇండిగో ఎయిర్ లైన్స్ సేవలు ప్రారంభమై 15 ఏండ్లు నిండటంతో విమానాశ్రయంలో వేడుక జరుపుకునేందుకు తన సహచర లౌరాతో కలిసి బయల్దేరాడు.
విమానాశ్రయం గేట్ 1 వద్ద ఇద్దరు క్యాబ్ దిగి లోపలికి వెళ్తుండగా వేగంగా వచ్చిన బస్సు ఢీకొట్టింది. దీంతో బస్సు చక్రాల పడి ప్రిన్స్‌రాజ్ ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. లౌరాకు తీవ్రగాయాలు కావడంతో చికిత్స నిమిత్తం దవాఖానకు తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అతివేగంగా బస్సు నడిపి ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఉద్యోగి మృతిచెందడంతో ఇండిగో ఎయిర్‌లైన్స్ వేడుకలను నిలిపివేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Saddula Bathukamma | అంబరాన్నంటిన సద్దులు.. ట్యాంక్‌బండ్‌పై ఘనంగా వేడుకలు.. ప్రత్యేక ఆకర్షణగా రష్మిక-విజయ్ జంట
Crop Losses | పంట నష్టం.. 20,000 కోట్లు..! సాగునీటి కొరత.. విద్యుత్తు కోతలతో రాష్ట్రవ్యాప్తంగా ఎండుతున్న పంటలు
BRS Legal Notice | వెలుగు పత్రికకు బీఆర్ఎస్ నోటీస్.. మాజీ సీఎం ప్రతిష్టను దెబ్బతీసే దుష్టప్రయత్నం
Horoscope | 19-10-2026 సోమవారం.. మీ రాశి ఫలాలు
TGSRTC | ఆర్టీసీ ఎన్నికల ఫలితాల్లో గూడు పుఠాణి..! అక్రమాలు.. ఫలితాల తారుమారుపై కార్మికుల పోరు బాట
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

