ఎదురెదురుగా రెండు విమానాలు.. తృటిలో తప్పిన ప్రమాదం

ముంబై: ఆకాశ మార్గంలో రెండు విమానాలు ఎదురెదురుగా ప్రయాణించాయి. చాలా దగ్గరకు వచ్చిన తర్వాత అలెర్ట్ కావడంతో అవి ఢీకొనే ప్రమాదం తప్పింది. జనవరి 29న జరిగిన ఈ ఘటనకు సంబంధించిన నివేదికను ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) ఇటీవల విడుదల చేసింది. జనవరి 29న ఎయిర్ ఏషియాకు చెందిన అహ్మదాబాద్-చెన్నై విమానం, ఇండిగోకు చెందిన బెంగళూరు-వడోదర విమానం ముంబై గగనతలంలో ఎదురెదురుగా చాలా దగ్గరకు వచ్చాయి. ఇవి 8 కిలోమీటర్ల దూరంలో ఉండగా ఇండిగో విమానం 38,000 అడుగుల ఎత్తులో, ఎయిర్ ఏషియా విమానం 38,008 అడుగుల ఎత్తులో ఎదురెదురుగా ఉన్నాయి. ఆ రెండు విమానాల మధ్య దూరం 6.5 కిలోమీటర్లు ఉండగా ఎయిర్ ఏషియా విమానంలోని వ్యవస్థ పైలట్లను హెచ్చరించింది. విమానాన్ని మరింత ఎత్తులోకి తీసుకెళ్లాలని అప్రమత్తం చేసింది. దీంతో ఆ విమానం 38,396 అడుగుల ఎత్తుకు చేరడంతో ఆ రెండు ఢీకొనే ప్రమాదం తప్పింది.
అయితే రెండు విమానాల పొజిషన్‌ను అంచనా వేయడంలో ముంబై ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ విఫలమయ్యారని ఆ నివేదిక పేర్కొంది. ఆటోమేటిక్ సిస్టమ్ హెచ్చరించినప్పటికీ రెండు విమానాలను హెచ్చరించడంలో కంట్రోలర్ నిర్లక్ష్యం వహించారని ఆరోపించింది. కాగా, సాధారణంగా అహ్మదాబాద్ నుంచి దక్షిణాది రాష్ట్రాలకు వెళ్లే విమానాలు భావనగర్ మీదుగా ప్రయాణిస్తాయి. అయితే ఆ రోజున ఎయిర్ ఏసియా విమానం ముంబై విమానాశ్రయంలో ల్యాండిగ్ మార్గంలో ప్రయాణించింది. ఎయిర్ ఏసియా విమానం తన మార్గాన్ని మార్చుకోవడంతో అదే మార్గంలో వస్తున్న ఇండిగో విమానం సమీపానికి వచ్చింది.
చివరకు ఎయిర్ ఏసియా విమానంలోని వ్యవస్థ హెచ్చరించడంతో ఎత్తు పెంచడంతో ఆ రెండు విమానాలు 300 మీటర్ల ఎత్తు, 500 మీటర్ల సమీపంలో క్రాస్ అయ్యాయి. ఎయిర్ ఏసియా విమానం సాధారణ రూట్లోనే ప్రయాణిస్తున్నదని కంట్రోలర్ భావించడం వల్ల లేదా మద్యం మత్తులో ఉండటం వల్ల ఇది జరిగి ఉంటుందని ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో తన నివేదికలో పేర్కొంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Italy | పిల్లలు విధ్వంసానికి పాల్పడితే,తల్లిదండ్రులు పరిహారం చెల్లించాలి! ఇటలీ ప్రభుత్వం కొత్త నిబంధన
Delhi Pollution | ఢిల్లీలో క్షీణించిన వాయు నాణ్యత జీఆర్ఏపీ-1 ఆంక్షలు అమలు
Kenya | స్వర్గం పేరుతో 190 మంది పిల్లలకు ఆకలి చావులు.. కెన్యాలో మత గురువు మూఢ బోధనలు
TGSRTC | తిరుగు ప్రయాణమూ భారమే..! ఆర్టీసీ, ప్రైవేటు వాహనాల్లో చార్జీల మోత
Peace Talks | రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి త్వరలో ముగింపు? త్రైపాక్షిక శాంతి చర్చలకు పుతిన్ అంగీకారం
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

