Air India Flight: కోల్‌కతాలో హైజాక్ అలర్ట్ జారీ చేసిన ఎయిర్ ఇండియా పైలట్
Air India Flight: ముంబైకి వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ తీసుకునే సమయంలో కోల్‌కతా విమానాశ్రయంలో హైజాక్ అలర్ట్ జారీ చేశారు. దీంతో భద్రతా సిబ్బంది హుటాహుటిన విమానాశ్రయానికి చేరుకుని తనిఖీలు చేపట్టారు.
కోల్‌కతా: కోల్‌కతా విమానాశ్రయంలో ఇవాళ ఉత్కంఠ వాతావరణం నెలకొన్నది. ముంబైకి వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం(Air India Flight) టేకాఫ్ తీసుకునే సమయంలో హైజాక్ అలర్ట్ జారీ చేశారు. దీంతో భద్రతా సిబ్బంది హుటాహుటిన విమానాశ్రయానికి చేరుకున్నట్లు కొన్ని టీవీ ఛానళ్లు పేర్కొన్నాయి. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు హైజాక్ మెసేజ్‌ను పైలట్ పంపినట్లు తెలిసింది. టేకాఫ్‌కు ముందు ఈ ఘటన జరిగింది. దీంతో ఆ విమానాన్ని పార్కింగ్ స్థలానికి తరలించారు. భద్రతా సిబ్బంది తనిఖీలు చేపట్టారు.
బహుశా ఓ ప్రయాణికుడి ప్రవర్తన వల్ల ఆ హెచ్చరిక చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. ఎయిర్ ఇండియ ఫ్లయిట్ 772 టేకాఫ్ తీసుకునే సమయంలో హైజాక్ అలర్ట్ జరిగింది. విమానంలో ఉన్న వాష్‌రూమ్‌లోని అద్దంపై హైజాక్ అని రాసినట్లు కొన్ని వర్గాల ద్వారా తెలుస్తోంది. కానీ ఇప్పటి వరకు అధికారులు సమాచారం ఇవ్వలేదు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Air India Flight: కోల్‌కతాలో హైజాక్ అలర్ట్ జారీ చేసిన ఎయిర్ ఇండియా పైలట్
Vijayasai Reddy | ఏపీలో మరో రాజకీయ పార్టీ.. ‘పరివర్తన రాజనీతి పార్టీ’ని ప్రకటించిన విజయసాయిరెడ్డి!
Hyderabad | రెండు నెలల్లో 9 మంది జలమండలి ఔట్సోర్సింగ్ ఉద్యోగుల మృతి..!
Vishwambara | మెగాస్టార్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. సైలెంట్‌గా పనులు పూర్తి చేస్తున్న వశిష్ఠ!
Tharun Bhascker | చెత్తను పంచదార పూసి ఇస్తే ఆడియన్స్ నమ్మరు.. రొటీన్ సినిమాలపై తరుణ్ భాస్కర్ కామెంట్స్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

