ఎయిర్ ఇండియాకు రూ.10లక్షల జరిమానా
న్యూఢిల్లీ : ఎయిర్ ఇండియాకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) రూ.10లక్షల జరిమానా విధించింది. చెల్లుబాటయ్యే టికెట్లున్న ప్రయాణికులకు బోర్డింగ్ నిరాకరించినందుకు చర్యలు చేపట్టింది. అంతేకాకుండా సమస్యను పరిష్కరించేందుకు తక్షణమే ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది. లేకుంటే చర్యలు తప్పవని డీజీసీఏ పేర్కొంది. చెల్లుబాటు అయ్యే టికెట్లు ఉన్న ప్రయాణికులు సమయానికి హాజరైనప్పటికీ విమానయాన సంస్థలు బోర్డింగ్‌ను తిరస్కరించినట్లు పలువురు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు బెంగళూరు, హైదరాబాద్, ఢిల్లీలో వరుస తనిఖీలు నిర్వహించింది. ఎక్కడా సంస్థలు నిబంధనలు పాటించడం లేదని డీజీసీఏ పేర్కొంది.
ఎయిర్ ఇండియా సంస్థ రెగ్యులేషన్స్‌ను అనుసరించడం లేదని వివరించింది. అందుకే ఆ సంస్థకు షోకాజ్ నోటీసు పంపామని పేర్కొంది. చెల్లుబాటయ్యే టికెట్లున్న ప్యాసింజర్లను బోర్డింగ్‌కు అనుమతించని సందర్భంలో ఆ ప్రయాణికులకు గంటలోపే మరో ప్రత్యామ్నాయం విమానాన్ని ఏర్పాటు చేయాలని డీజీసీఏ నిబంధనలను గుర్తు చేసింది. గంటలోపే ప్రత్యామ్నాయంగా మరో విమానాన్ని ఏర్పాటు చేస్తే అలాంటి సందర్భంలో ప్రయాణికులకు పరిహారం అందిచాల్సిన అవసరం ఉండదని పేర్కొంది. ఒక వేళ ఆ ప్రయాణికులకు ప్రత్యామ్నాయ విమాన సౌకర్యం ఏర్పాటు చేయడానికి 24 గంటల్లోపు సమయం పడితే.. ప్రయాణికులకు రూ.10వేల పరిహారం చెల్లించాల్సి ఉంటుందని చెప్పింది. 24 గంటలు దాటితే ప్రయాణికులకు రూ. 20 వేల నష్టపరిహారం అందించాలని పేర్కొంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

