కాబూల్‌కు వెళ్లేందుకు ఎయిర్‌ఫోర్స్ విమానం రెడీ! అందుకేనా?!
కాబూల్‌కు వెళ్లేందుకు ఎయిర్‌ఫోర్స్ విమానం రెడీ! | ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్‌లో చిక్కుకున్న భారత రాయబార కార్యాలయ సిబ్బందిని తీసుకొచ్చేందుకు కేంద్ర ....

న్యూఢిల్లీ: ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్‌లో చిక్కుకున్న భారత రాయబార కార్యాలయ సిబ్బందిని తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తున్నది. అందుకోసం భారత వాయుసేన (ఐఏఎఫ్) ప్రత్యేక విమానం ఏసీ -17ను సిద్ధంగా ఉంచారు. ప్రస్తుతం కాబూల్ విమానాశ్రయం తాలిబన్ల ఆధీనంలో ఉన్న నేపథ్యంలో ఐఏఎఫ్ విమానాన్ని అక్కడికి పంపేందుకు అమెరికాతో కేంద్ర హోంశాఖ వర్గాలు నిరంతరం సంప్రదిస్తున్నాయని సమాచారం.
250 మంది ఇండియన్ల తరలింపుపై ఆశాభావం
ఈ విమానంలో 250 మంది భారతీయులను తరలించగలమని కేంద్ర ప్రభుత్వం ఆశాభావంతో ఉంది. విమానాశ్రయంతోపాటు యావత్ కాబూల్.. తాలిబన్ల ఆధీనంలో ఉన్న సంగతి తెలిసిందే. అడుగడుగునా చెక్ పాయింట్లు ఏర్పాటు చేశారు తాలిబన్లు. ఈ నేపథ్యంలో ఎంత మంది విమానాశ్రయానికి చేరుకోగలరన్న దానిపైనే చర్చ జరుగుతున్నది.
వట్టి చేతులతోనే వెనుదిరిగిన ఎయిరిండియా విమానం
ఇంతకుముందు కాబూల్ బయలుదేరి వెళ్లిన ఎయిర్ ఇండియా విమానం.. విమానాశ్రయంలో దిగకుండానే తిరిగి వచ్చింది. రాయబార కార్యాలయ సిబ్బందితోపాటు మొత్తం 400 మందికి పైగా భారతీయులు ఉన్నట్లు తెలుస్తున్నది. ఆఫ్ఘన్ దేశీయులు సైతం భారత్‌కు వచ్చేందుకు దాఖలు చేసిన వీసా అప్లికేషన్లు కేంద్ర హోంశాఖ పరిశీలనలో ఉన్నాయి. మంగళవారం ఆఫ్ఘన్లో భారత రాయబారి రుద్రేండ్ర టాండన్‌తోపాటు 120 మంది దౌత్య సిబ్బంది స్వదేశానికి తిరిగి వచ్చిన సంగతి తెలిసిందే.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- afghanistan
- IAF
- indian mission
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
Rains | బంగాళాఖాతంలో అల్ప పీడనం.. మూడు రోజులు వర్షాలు..!
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

