శశికళ వ్యవహారంపై క్లారిటీ : చిన్నమ్మకు ఏఐఏడీఎంకె చెక్

కృష్ణగిరి : తమిళనాడు దివంగత సీఎం జయలలిత సన్నిహితురాలు వీకే శశికళ వ్యవహారంలో నెలకొన్న గందరగోళానికి ఏఐఏడీఎంకే తెరదించింది. శశికళ తమ పార్టీలో లేరని, ఆమెను తిరిగి పార్టీలోకి చేర్చుకోబోమని ఏఐఏడీఎంకే స్పష్టం చేసింది. ఏఐఏడీఎంకేలో తిరిగి కీలక పాత్ర పోషిస్తానని శశికళ సంకేతాలు పంపిన నేపథ్యంలో ఆ పార్టీ వివరణ ఇచ్చింది. పార్టీలో ఆమెకు తిరిగి అవకాశం ఇచ్చే ప్రసక్తి లేదని ఏఐఏడీఎంకే సీనియర్ నేత కేపీ మునుస్వామి పేర్కొన్నారు.
అయితే శశికళ పార్టీలో లేరని ఏఐఏడీఎంకే పరిణామాలతో ఆమెకు సంబంధం లేకపోయినా గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని మునుస్వామి అన్నారు. కాగా శశికళ తన సన్నిహితులతో ఫోన్ లో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ఆదివారం బయటకు రావడం కలకలం రేపింది. ఈ సంభాషణల్లో ఆమె పార్టీని చక్కదిద్దేందుకు తాను చొరవ చూపుతానని ఇద్దరు అగ్రనేతల (పన్నీర్ సెల్వం, పళనిస్వామి) మధ్య విభేదాలతో దెబ్బతిన్న పార్టీ ప్రయోజనాలను కాపాడేందుకు పనిచేస్తానని వ్యాఖ్యానించారు. పార్టీ, నేతల పేర్లు ప్రస్తావించకపోయినా ఏఐఏడీఎంకేపై తిరిగి ఆమె పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తున్నారని పార్టీలో చర్చ నడిచింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- AIADMK
- Tamilanadu
- VK Sasikala
RELATED ARTICLES
తాజా వార్తలు
Foreign currency | శంషాబాద్ ఎయిర్పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
Karimnagar | ధ్రువీకరణ పత్రం అందేదెలా?.. కరీంనగర్ నగరపాలక సంస్థ నిర్లక్ష్యంతో విలీన గ్రామాల వారికి తిప్పలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

