యాక్సిడెంట్ తర్వాత 40 సార్లు గర్ల్‌ఫ్రెండ్‌కు ఫోన్
మద్యం మత్తులో బీఎండబ్ల్యూను నడిపి ఒక మహిళను ఢీకొని ఆమె మృతికి కారకుడైన శివసేన నేత కుమారుడు మిహిర్ షాకు కోర్టు ఈనెల 16 వరకు పోలీస్ కస్టడీ విధించింది.
ముంబై, జూలై 10: మద్యం మత్తులో బీఎండబ్ల్యూను నడిపి ఒక మహిళను ఢీకొని ఆమె మృతికి కారకుడైన శివసేన నేత కుమారుడు మిహిర్ షాకు కోర్టు ఈనెల 16 వరకు పోలీస్ కస్టడీ విధించింది. ఆదివారం తెల్లవారుజామున వర్లీ ప్రాంతంలో యాక్సిడెంట్ చేసిన తర్వాత మిహిర్ షా 40 సార్లు తన ప్రియురాలికి ఫోన్ చేసినట్టు పోలీసులు నిర్ధారించారు. ఇప్పుడు ఆమెను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించే అవకాశం ఉంది. ప్రమాదంలో మహిళ మరణించిన తర్వాత ఆటోలో గోరేగావ్‌లోని ప్రియురాలి ఇంటికి వెళ్లిన మిహిర్ అక్కడ రెండు గంటలు ఉన్నాడు. ఆమె అతని సోదరికి ఫోన్ చేసి చెప్పడంతో ఆమె వచ్చి షాను బోరివలిలోని తన ఇంటికి తీసుకుపోయింది. అక్కడి నుంచి 70 కి.మీ. దూరంలోని షాహ్‌పూర్‌లోని ఒక రిసార్టుకు పరారయ్యారు. అయితే ఫోన్ ద్వారా అతని లొకేషన్‌ను కనిపెట్టిన పోలీసులు షాను అరెస్ట్ చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

